పిల్లల బ్యాగులపై టీ సర్కార్ కీలక నిర్ణయం| Telangana govt Big Relaxation to School Children

Go puts cap on school bag weight in telangana

Telanagana, Telangana Schools, Telangana GO 22, Telangana SChool kids, Telangana Schools Bag Weight, KCR School Children, No Home Work Books, Children Bag Weight, School Children Bags, Indian School Children, School Bag Weight, Telangana

Telangana govt New GO. School bags should not weigh more than 5 kgs. According to 22 GO also asks schools to provide safe drinking water so as to avoid children getting water bottles from home, which add to their load.

బాల్యంపై భారం ఇక ఉండబోదు

Posted: 07/19/2017 09:55 AM IST
Go puts cap on school bag weight in telangana

బాల్యంపై బండ రాయిలుగా మారుతున్న బ్యాగులు చూస్తే పెద్దలకే భయం వేయటం ఖాయం. అంతేసి బరువులు వాళ్లు ఎలా మోస్తారో అంటూ ఒక్కోసారి తలుచుకుంటేనే బాధ వేస్తుంది. అసలు ఈ వయసులో అన్ని పుస్తకాలు అవసరమా? అనే ప్రశ్న అందరనీ తొలుస్తుంది. అయితే ఈ విషయంలో తెలంగాణ విద్యాశాఖ ఓ శుభవార్త చెప్పింది. చిన్నారులకు సంచి బరువుతోపాటు, హోంవర్క్‌లను కూడా తగ్గిస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించి విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ రంజీవ్‌ ఆర్‌ ఆచార్య జీవో 22ను జారీ చేశాడు.

హమాలీ పని చేస్తున్నట్టు, బరువైన స్కూల్ బ్యాగులతో పోయే విద్యార్థులను చూస్తుంటాం. కానీ, తాజా ఆదేశాలతో నడుం వంగిపోయేలా పుస్తకాలు మోస్తున్న పిల్లలకు ఇక ఊరట లభిస్తుంది. వైద్యులు చెబుతున్నట్లు వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న ఈ అంశంపై ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక స్థాయిలో పుస్తకాల సంచి బరువు 6 నుంచి 12 కిలోలు, ఉన్నత పాఠశాల స్థాయిలో 12 నుంచి 17 కిలోలు ఉన్నట్టు గుర్తించారు. ఈ బరువు కారణంగా విద్యార్థుల వెన్నెముక, మోకాళ్లు దెబ్బతినే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చారు. దీంతో తరగతుల వారీగా పుస్తకాల బరువు గరిష్టంగా ఎంత ఉండాలో పేర్కొంటూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) నిర్దేశించిన ప్రకారం పాఠ్యపుస్తకాలు ఉండాలని, గైడ్లు, అనవసర విద్యాసంబంధ పుస్తకాలను ప్రోత్సహించరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే ఐదో తరగతి వరకు పిల్లలకు హోంవర్క్ ఇవ్వరాదని, బడిలోనే దానిని చేయించాలని, అవసరమైతే అందుకోసం ప్రత్యేకంగా ఓ పిరియడ్ కేటాయించాలని పేర్కొంది.

సాధారణ మార్గదర్శకాలు

రాష్ట్ర అకడమిక్‌ అథారిటీ లేదా ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన పాఠ్య పుస్తకాలను మాత్రమే ఉపయోగించాలి.

ప్రతి తరగతికి ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన పుస్తకాల సంఖ్య దాటరాదు.

కాన్సె్‌ప్టని విద్యార్థులు అవగాహన చేసుకునేలా చేయాలి. బట్టీ పట్టించడం మంచిది కాదు. చదవడానికి, భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛనివ్వాలి.

పాఠశాల సమయంలో, ఆ తర్వాత గైడ్లను ఉపయోగించకూడదు. విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వ వికాసానికి పాటుపడాలి.

గ్రంథాలయంలోని పుస్తకాలను చదివించాలి. ఆటలు, కళలు, సాంస్కృతిక విభాగాలు, సహ పాఠ్యాంశాల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.

గైడ్లు, గైడు పుస్తకాల వినియోగాన్ని 2014 మే 14న జారీ చేసిన జీవో 17 ద్వారా నిషేధించారు. పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలు, ఇతర అంశాలను విద్యార్థులే స్వంతంగా రాసేలా చూడాలి. ఉపాధ్యాయులు అవసరమైన చోట సరిదిద్దాలి.

పాఠశాల సమయాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తీరు సహా అకడమిక్‌ క్యాలండర్‌లో పేర్కొన్న అన్ని అంశాలపై అవగాహన ఉండాలి.

సాయంత్రం వేళల్లో ట్యూషన్లు, రాత పనిలో నిమగ్నం చేసే బదులు ఆటల్లో పాల్గొనడానికి విద్యార్థులను ప్రోత్సహించాలి.

1, 2 తరగతుల విద్యార్థుల స్కూల్‌ బ్యాగు బరువు 1.5 కిలోలకు మించకూడదు. 3, 4, 5 తరగతులకు 3 కిలోల్లోపు; 6, 7 తరగతులకు 4 కిలోల్లోపు, 8, 9, 10 తరగతులకు 5 కిలోల్లోపు ఉండాలి.

 

వీటితోపాటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు, ప్రాథమిక పాఠశాలలకు విడివిడిగా ప్రత్యేక మార్గదర్శకాలను కూడా రూపొందించి విడుదల చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  School Children  Bag Weight  GO Passed  

Other Articles