khayyum bhai movie actor director kidnapped టాలీవుడ్ నటుడు, దర్శకుల కిడ్నాప్.. రూ.10 కోట్ల డిమాండ్

Khayyum bhai movie actor director kidnapped

tarak ratna, khayum bhai actor kidnap, khayum bhai director kidnaped, Khayum Bhai, Katta rambabu, Bharath, Kidanap, publicity stunt, real kidnap, tollywood, crime

Khayyum Bhai movie hero Katta Rambabu and director Bharath Parepally kidnapped and released.

టాలీవుడ్ నటుడు, దర్శకుల కిడ్నాప్.. రూ.10 కోట్ల డిమాండ్

Posted: 07/02/2017 04:58 PM IST
Khayyum bhai movie actor director kidnapped

తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఒడిషా ఇటు ఛత్తీస్ గడ్ వరకు తన నేర సామ్రాజ్యాన్ని స్థాపించిన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'ఖయ్యూం భాయ్' సినిమాను ఈ శుక్రవారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రంలో నయీం పాత్ర పోషించిన నటుడు హీరో కట్టా రాంబాబుకు కానీ, లేదా చిత్ర దర్శకుడు భరత్ పారేపల్లి కానీ ఊహించని విధంగా చిత్రంలో రూపొందించిన సన్నివేశాన్ని వారు స్వతహాగా అనుభవించారు.

అదేంటి అంటారా..? గ్యాంగ్ స్టర్ నయీం అనేక మందిని కిడ్నాప్ చేసి తన చెరలో బంధించుకున్నారన్న వార్తలు వెలుగుచూసిన నేపథ్యంలో అదే తరహాలో చిత్ర హీరో రాంబాబు, దర్శకుడు భరత్ లను కొందరు అగంతకులు కిడ్నాప్ చేశారు. వీరిద్దరూ కలసి ప్రయాణిస్తున్న కారును కొందరు దుండగులు అడ్డుకున్నారు. వారిని బెదిరించిన అగంతకులు వారిని తమ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.

హీరో దర్శకులు అగంతకులు ఏకంగా అనంతపురం తీసుకెళ్లి, అక్కడ ఓ హోటల్ లో వారిని నిర్భంధించారు. తమకు తక్షణం 10 కోట్ల రూపాయలు ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు. అయితే రాంబాబు, భరత్ ల ఫోన్ సిగ్నల్స్ తో వారెక్కడున్నారన్న సమాచారాన్ని పోలీసులు కనుగొన్నారని సమాచారం అందుకున్న అగంతకులు వారిని అక్కడే వదిలేసి పరరయ్యారు. ఈ రోజు సాయంత్రం వారు హైదరాబాదు చేరుకోనున్నారు.  అయితే వారిని ఎవరు కిడ్నాప్ చేసిందన్న విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khayum Bhai  Katta rambabu  Bharath  Kidanap  publicity stunt  real kidnap  tollywood  crime  

Other Articles