Struggling 23-year-old actor slits wrists, saved by cops వర్థమాన బాలీవుడ్ నటుడిని కాపాడిన పోలీసులు

Struggling 23 year old actor slits wrists saved by cops

struggling actor, bollywood actor, struggling actor suicide attempt, bollywood actor suicide attempt, bollywood actor aunt rajashree, struggling actor goreaon police, movies chances actroe, Mumbai, Mumbai news, Mumbai suicides, Mumbai police, vanrai Colony, Goregaon east police, mumbai police, crime

A 23-year-old struggling actor, who allegedly tried to kill himself, was saved in the nick of time by the police after they received a call from his mother from Allahabad.

వర్థమాన బాలీవుడ్ నటుడిని కాపాడిన పోలీసులు

Posted: 07/02/2017 05:48 PM IST
Struggling 23 year old actor slits wrists saved by cops

బాలీవుడ్ సినీమాయ లోకంలో ఒక వెలుగు వెలగాలని భావించాడు. రంగరంగుల లోకంలో తాను ఓ రంగుగా మారాలని కలలు కన్నాడు. కానీ అతని కలలు కల్లలైన వెంటనే తన బతుకునే చిధ్రం చేసుకోవాలనుకున్నాడు. అనుకున్నంత పని చేశాడు. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు అతడిని కాపాడటంలో సఫలమయ్యారు. అహ్మద్ నగర్ కు చెందిన వర్థమాన నటుడు ముంబైకి మకాం మార్చి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. అయితే ప్రోత్సాహకరమైన అవకాశాలు రాకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  

ఈ ఘటన ముంబైలోని గరోగావ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరెగావ్ ఈస్ట్ లోని వన్రాయి కాలనీలో 23 ఏళ్ల వర్థమాన నటుడు నివాసం ఉంటూ సినీ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే శనివారం రాత్రి సదరు యువకుడు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు స్నేహితులకు వాట్స్ యాప్ లో మెసేజ్ పెట్టాడు.దీనిని చూసిన అతని మిత్రులు, అతని పిన్ని రాజశ్రీకి ఫోన్ చేసి, జరగబోతున్న దారుణాన్ని వివరించారు. ఆమె వెంటనే తన అక్క పూజకు ఫోన్ చేసి, విషయం వివరించింది.

దీంతో అప్రమత్తమైన ఆమె 3:30 గంటల సమయంలో ఇంటర్నెట్ లో అక్కడి పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ వెతికి అక్కడి ఇన్ స్పెక్టర్ ఇంద్రజీత్ పాటిల్ కు విషయం వివరించింది. వెంటనే అప్రమత్తమైన ఎస్సై సిబ్బందితో వెళ్లి అతను నివాసం ఉంటున్న ఫ్లాట్ తలుపులు పగులగొట్టి చూడగా, బాత్రూంలో చేతి మణికట్టు, గొంతు కోసుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో అతనిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : struggling actor  suicide attempt  slit throat  vanrai colony  goregaon  mumbai police  crime  

Other Articles