Roja get Package from YSRCP Chief Jagan

Tdp mla varma comments on roja

Pithapuram MLA, MLA Varma, Varma Roja, MLA Varma YSRCP, Roja Iron Leg, Iron Leg Roja Jagan, Jagan Iron Leg, Roja Package from Jagan, Jagan Package to Roja, Roja 10 Crores Jagan, YS Jagan MLA Roja, Roja Jagan, TDP MLA Fire Roja, Varma Comments on Jagan

Pithapuram MLA Varma Fire on YSRCP MLA Roja. Roja gets package from Jagan and Hope continue Her Iron leg to that party settled as Opposition.

రోజాపై వర్మ కామెంట్స్ విన్నారా?

Posted: 07/01/2017 02:38 PM IST
Tdp mla varma comments on roja

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గత కొన్ని రోజులుగా వార్త్లల్లో నానుతున్న విషయం తెలిసిందే. జగన్ తిట్టాడని, ఆ వెంటనే టీడీపీయో లేక పవన్ జనసేనలోనో చేరటం ఖాయమైపోయిందని గాలి వార్తలు చెలరేగాయి. తనను ఎమ్మెల్యేను చేసి ఆపై రక్షణ కల్పిస్తున్న జగన్ ను వదిలి తాను ఏ పార్టీలోకి వెళ్లనని క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన టీడీపీ నేతలు రోజాను ఓ రేంజ్ లోనే విమర్శించటం మొదలుపెట్టారు. పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ అయితే కాస్త తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రోజాకు ఒక నీతి అంటూ ఏమీ లేదని, ఏ పార్టీ ప్యాకేజీ ఇస్తే అక్కడకు వెళ్తుందని అన్నాడు. అంతేకాదు జగన్ నుంచి కూడా రోజా రూ. 10 కోట్ల ప్యాకేజీ తీసుకుందని ఆరోపించాడు. అలాంటి మనిషికి చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కూడా లేదన్నాడు.

ఐరన్ లెగ్ రోజా పుణ్యమాని వచ్చే ఎన్నికల్లో జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పాడు. ఒకానోక దశలో టీడీపీ తలుపును కూడా రోజా తట్టిందని, కానీ, అలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తులు తమకు అక్కర్లేదనే తమ అధినేత పక్కనపెట్టాడని చెప్పుకొచ్చాడు. రోజా ఎప్పుడూ వైకాపాలోనే ఉండాలని.. అలా అయితేనే జగన్ ప్రతిపక్షంలోనే ఉంటాడంటూ సెటైర్ వేశాడు. కాకినాడలో వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తుందని, కానీ, జనాలకు మాత్రం అది ఓ జబర్దస్త్ షో అని ఫీలవుతున్నారని ఎద్దేవా చేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pithapuram  MLA Varma  YSRCP  Roja  Package Allegations  

Other Articles