PAN card valid Even Not Linked with Aadhar

Pan without aadhaar will be valid

Aadhaar-PAN Link, Aadhaar-PAN Linkup, Aadhaar-PAN Link Last Date, PAN Card Invalid, No Last date for Aadhaar-PAN Link, Aadhaar-PAN Link Date, PAN Aadhar last Date, PAN July 2017 Rumour

Aadhaar-PAN linking Row. CBDT says PAN card won't be invalid if not linked with Aadhaar card by July 1.

పాన్ కార్డు చెల్లదా!... ఇప్పుడెలా?

Posted: 07/01/2017 10:29 AM IST
Pan without aadhaar will be valid

ఆధార్ తో అన్నింటి అనుసంధానం ప్రక్రియలో భాగంగా పాన్ కార్డును కూడా లింక్ చేయాలని టాక్స్ డిపార్ట్ మెంట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 30వ తేదీనే ఆఖరి తేదీ అంటూ బుధవారం ఇందుకు సంబంధించిన ఓ నోటిఫికేషన్ రాగా అంతా ఎగబడిపోయి అనుసంధానం చేసేసుకున్నారు.

అయితే ఆధార్ తో అనుసంధానం చేసుకోకపోతే, జూలై 1 నుంచి మీ పాన్ కార్డు నిరుపయోగం అవుతుందా? అన్న విస్తృత ప్రచారంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ చెక్ పెట్టింది. ఎందుకంటే మీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు లేదా కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేసినప్పుడు తప్పనిసరిగా ఆధార్ తో అనుసంధానం చేసుకోండి అంటూ ఆదాయపుపన్ను శాఖ సూచించింది. పేర్లలో తేడాలు, అక్షరదోషాలు, ముందు పేరు, తరువాత ఇంటి పేరు ఇలాంటి కారణాలతో పలువురి ఆధార్, పాన్ కార్డుల అనుసంధానం జరగలేదు.

అంతే కాకుండా అన్నీ బాగున్నా చివరిరోజైన శుక్రవారం యూఐడీఏఐ వెబ్ సైట్ స్తంభించిపోయింది. ఆ కారణంగా వినియోగదారుల ఆధార్, పాన్ అనుసంధానం జరగలేదు. దీంతో దిగివచ్చిన ఆదాయపుపన్ను శాఖ తాజాగా ప్రకటన జారీ చేసింది. నోటిఫికేషన్ లో చిన్న తప్పు దొర్లిందని, పాన్ ఆధార్ లింకుకు తుది గడువు ఏం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు అనుసంధానం కాకపోయినా ఫర్వాలేదు కానీ, త్వరగా అనుసంధానం చేసుకోవాలని, ఇందుకు సంబంధించి తుది తేదీని త్వరలో ప్రకటిస్తామని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర మీడియాకు తెలిపాడు.

ఆధార్ పాన్ లింకు కోసం www.incometaxindiaefiling.gov.in  ను క్లిక్ చేయండి

 

లేదా UIDPAN<SPACE><12-digit Aadhaar><Space><10-digit PAN>

అని 567678 or 56161 కి ఎస్సెమ్మెస్ పంపండి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhaar-PAN Link  CBDT  Last Date  

Other Articles