Flipkart, Shopclues to start sale offers from June 10 ఈ కామెర్స్ షాపర్స్ కు పండగే.. ఆఫర్ల ఫెస్టివెల్

Flipkart shopclues to start sale offers from june 10

ShopClues, Flipkart, e-commerce, discount sale, offers fest, electronic gadgets, fashion sale, home kitchen, 'Bid n Win' contest,

E-commerce players Flipkart and Shopclues will kick off sale offers on their websites from June 10, promising high discounts.

ఈ కామర్స్ షాపర్స్ కు ఇక పండగే...

Posted: 06/10/2017 11:12 AM IST
Flipkart shopclues to start sale offers from june 10

షాపింగ్ అంటే ఒకప్పుడు గంటల పాటు దుకాణాలలో వేచి చూసే ధోరణి, అన్ని సెలక్ట్ చేసుకున్నాక తీరా షాపు యాజమాన్యం ప్రకటించిన డిస్కౌంట్ అన్నింటిపై ఇవ్వలేమని, కేవలం కొన్ని ఎంపిక చేసిన వాటిపైనే డిస్కౌంట్ అని చెప్పడంతో ఊసురుమంటూ బిల్లు కట్టే పరిస్థితుల నుంచి ఈ కామర్స్ సైట్లు వచ్చి ఫలానా వస్తువుపై ఫలానా డిస్కౌంట్ అని స్పష్టంగా ప్రకటించడంతో షాపింగ్ మేడ్ ఈజీ అని తేలిపోయింది. దీంతో అందివచ్చిన సాంకేతిక విఫ్లవం షాపింగ్ కూడా మేడ్ ఈజీగా మార్చేసింది. ఇక దీనికి తోడు ఈ కామర్స్ సైట్లు ఏడాదికి రెండు మూడు పర్యాయాలు డిస్కౌంట్ అపర్లను ప్రకటించడంతో ఇక ఈ కామర్స్ షాపర్స్ కి పండగలను తీసుకువచ్చింది.

ఇప్పటికే అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ ను ప్రకటించగా, తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, దీనికి తోడు షాపింగ్ క్లూస్ కామర్స్ సైట్లు భారీ డిస్కౌంట్ల పండగకు తెరతీసింది. ప్లిప్ కార్ట్ ఇవాళ్టి నుంచి డిస్కౌంట్ సేల్ నిర్వహిస్తోంది. ఫ్యాషన్ ఉత్పత్తులపై 9-డే ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ ప్రారంభిస్తుండగా... షాప్ క్లూస్, హోమ్ కిచెన్, ఎలక్ట్రిక్ యాక్ససరీస్, ఫ్యాషన్, సంబంధిత యాక్ససరీస్ పై వారం పాటు  సేల్ ఆఫర్లు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షల కొద్ది ఫ్యాషన్ లవర్స్ కోసం ఈ ఎక్స్ క్లూజివ్ సేల్ ను నిర్వహిస్తున్నట్టు ఫ్లిప్ కార్ట్ ఫ్యాషన్ హెడ్ రిషి వాసుదేవ్ తెలిపారు.
 
జూన్ 10 నుంచి మొదలై, తొమ్మిది రోజుల పాటు అంటే జూన్ 18 వరకు ఈ సేల్ నిర్వహిస్తామని చెప్పారు. దీనిలో 50 బ్రాండ్స్ పై 50-80 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ ను కంపెనీ అందించనుంది. ఈ తొమ్మిది రోజుల విక్రయంలో భాగంగా 'బిడ్ అండ్ విన్' కంటెక్ట్స్ ను కూడా కస్టమర్లకు ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.

ఈ బిడ్ లో పాల్గొన్న కస్టమర్లు అతి తక్కువ ధరలు కోట్ చేసి విలువైన వస్తువులను గెలుపొందే అవకాశముందని చెప్పారు. ఈ కంటెక్ట్స్ లో 13,995 రూపాయల విలువైన ఎంపోరియో అర్మానీ వాచ్ ను, 15,960 రూపాయల విలువైన విక్టోరినాక్స్ బ్యాగ్ ను అందించనున్నట్టు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. అదేవిధంగా షాప్ క్లూస్ నిర్వహిస్తున్న సేల్ పై కూడా  ఆ కంపెనీ భారీ ఆశలే పెట్టుకుంది. గత నెలలో నిర్వహించిన సేల్ కంటే రెండింతలు లావాదేవీలను పెంచుకోవాలని షాప్ క్లూస్ చూస్తోంది. షాఫ్ క్లూస్ నిర్వహిస్తున్న వాల్యూ సేల్ లో కస్టమర్లను అకర్షించే పలు వస్తువులపై భారీ డిస్కౌంట్ ప్రకటించామని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు హమీత్ సింగ్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Nirbhaya convict pawan gupta files curative petition in supreme court

  ‘నిర్భయ’ కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దోషి పవన్ గుప్తా

  Feb 28 | దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు మరోమారు శిక్ష నుంచి తప్పించుకున్నట్లేనా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులోని దోషులకు వేర్వేరుగా మరణ శిక్ష విధించాలని ఉద్దేశించిన పిటిషన్ పై... Read more

 • High court serious on mishandling chandrababu naidu in visakhapatnam

  చంద్రబాబును.. ఈ నోటీసుతో ఎలా అరెస్ట్ చేశారు.?: హైకోర్టు

  Feb 28 | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉతన్నమైన పరిణామాలకు పోలీసుల నిర్లక్ష్యం కూడా తోడందైన్న విమర్శలు వినిపించాయి. సుమారు మూడున్నర గంటల పాటు కారులోనే కూర్చున్నా.. పోలీసులు అధికార వైసీపీ పార్టీ... Read more

 • Tension previals in amaravati as ycp activists rally continues in front of farmers protesting tents

  అమరావతిలో ఉద్రిక్తత: రైతుల శిభిరాల మీదుగా వైసీపీ ర్యాలీ..

  Feb 28 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపూర్ణ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 73వ రోజుకు చేరాయి. తాము ఏ ప్రాంత అభివృద్దికి వ్యతిరేకం కాదని.. అయితే అభివృద్ది వికేంద్రీకరణకు తామూ... Read more

 • Delhi woman delivers miracle baby hours after being attacked and kicked in the stomach by rioters

  సీఏఏ అల్లర్లు: మిరాకిల్ బేబికి జన్మనిచ్చిన యువతి

  Feb 28 | ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న రేగుతున్నఅల్లర్లు స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అల్లర్ల మాటును అందోళనకారులు కనీసం తాము మనుషులం అన్న ఇంకితాన్ని కూడా మర్చిపోయారు. సీఏఏ చట్టానికి అనుకులమా.? వ్యతిరేకమా.?... Read more

 • Coronavirus in india us spy agencies monitor coronavirus spread concerns about india

  భారత్ కరోనా కట్టడిపై.. అందోళనలలో అగ్రరాజ్యం.!

  Feb 28 | ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు మాత్రం దీనిని తేలిగ్గా తీసుకుంటున్నాయని అగ్రరాజ్యం అమెరికా అభిప్రాయపడింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థలు దీనిపై దృష్టి సారించాయని సంబంధిత... Read more

Today on Telugu Wishesh