SI lakshma reddy arrested over dowry harrasment నా భర్తకు అమ్మాయిలు, డబ్బు పిచ్చి వుంది: జ్యోతి

Si lakshma reddy arrested over dowry harrasment

jyothi reddy, sangareddy si, p lakshma reddy, janaki reddy, dowry harrasment, obscene videos, internet, crime

Sangareddy district and head quarter SI lakshma reddy arrested over dowry harrasment after his wife jyothi reddy complaints on him.

ITEMVIDEOS: నా భర్తకు అమ్మాయిలు, డబ్బు పిచ్చి వుంది: జ్యోతి

Posted: 05/31/2017 05:32 PM IST
Si lakshma reddy arrested over dowry harrasment

ఆయన ఒక పోలిస్ స్టేషన్ అధికారి. ఆ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు తన విధులు కల్పించాయి. అయితే తన విధులు నిర్వహిస్తున్న ప్రాంతానికి.. నివాసం వుంటున్న ప్రాంతానికి తేడా వుందనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఏకంగా ఇంట్లో మాత్రం శాడిస్టుగా మారాడు. అంతేకాదు తన భార్య విడాకులు ఇవ్వమని నిత్యం పోరు పెడుతున్నారు. అంతటితో అగకుండా తనకు వెంటనే విడాకులు ఇవ్వకపోతే తమ రహస్య వీడియోలను అంతర్జాలంలో పెడతానని కూడా భరితెగించి మరీ హెచ్చరించాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడంటే.. మరో పెళ్లి చేసుకుంటే  కోట్ల రూపాయల కట్నం వస్తుందనే.

ఇంతకీ ఆయన ఎవరు అంటారా..? సంగారెడ్డి ఎస్సై పెద్దోళ్ల లక్ష్మారెడ్డి. అతని భార్య జ్యోతి పిర్యాదుతో మల్కాజ్‌గిరి పోలీసులకు లక్ష్మారెడ్డిని అరెస్టు చేశారు. వసంతపురికాలనీకి చెందిన కె.జ్యోతిరెడ్డికి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి గాజులగూడేనికి చెందిన లక్ష్మారెడ్డితో 2013లో వివాహమైంది. ప్రసుత్తం లక్ష్మారెడ్డి సంగారెడ్డి టౌన్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో ఆరు లక్షల నగదు, 40 తులాల బంగారం కట్నకానుకల కింద అందజేశారు. వీరికి రెండున్నరేళ్ల బాబు సృజన్‌రెడ్డి ఉన్నాడు. లక్ష్మారెడ్డి అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో ఆమె మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

స్థానిక పోలీసులకు భార్య జ్యోతి మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో.. అమె ఏకంగా ఉన్నతాధికారులను కలసింది. ఉన్నతాధికారులు అదేశించడంతో కదిలిన స్థానిక పోలీసులు లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతని భార్య జ్యోతి మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తకు డబ్బు, అమ్మాయిల పిచ్చి వుందని అరోపించింది. తన ముందే లేడీ కానిస్టేబుళ్లతో, పోలీస్‌ స్టేషన్‌ సమస్యలతో వెళ్లే మహిళలతో సరసాలు ఆడతాడని ఆరోపించింది. అంతేకాదు.. తనపై అనుమానంతో ఇంటినిండా సీసీ కెమెరాలు బిగించాడని వాపోయింది. మరో పెళ్లి… కట్నం కోసం పాకులాడుతూ విడాకులివ్వాలని వేధిస్తున్నాడని,… లేకపోతే బెడ్‌రూం వీడియోలు వెబ్‌సైట్లకు అప్‌లోడ్‌ చేస్తానంటున్నాడని ఫిర్యాదు చేసింది. భర్త అయిన సంగారెడ్డి ఎస్సై లక్ష్మారెడ్డి చేష్టలకు సంబంధించి తన వద్ద సీడీలతో సహా ఆధారాలు ఉన్నాయని చెబుతోంది బాధితురాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles