'I was punched, kicked in delhi assembly alleges Kapil Mishra కౌరవ సభను మించిపోయిన ఢిల్లీ అసెంబ్లీ..?

I was punched kicked by aap members alleges kapil mishra

aap rebel mla Kapil Mishra, Kapil Mishra manhandled in assembly, Kapil Mishra manhandled by aap mlas, Kapil Mishra kicked by aap mlas, Kapil Mishra punched by aap mlas, Kapil Mishra aap mlas, Kapil Mishra arvind kejriwal, Kapil Mishra, Satyendra Jain, GST, Delhi Legislative Assembly, Arvind Kejriwal, AAP

Chaos reigned in the Delhi Legislative Assembly as AAP lawmakers allegedly assaulted rebel party member Kapil Mishra and clashed with members of the opposition

ITEMVIDEOS: ‘‘నన్ను కోట్టి, తన్ని బయటకు పంపారు’’ కపిల్ మిశ్రా

Posted: 05/31/2017 03:18 PM IST
I was punched kicked by aap members alleges kapil mishra

నన్ను కొట్టారు. కొందరు తన్నారు.. అదే సమయంలో నన్ను అసెంబ్లీ నుంచి బయటకు పంపారు. మార్షల్ నన్ను బలవంతంగా బయటకు లాక్కోచ్చారు. ఈ అరోపణలు చేసింది ఎవరో కాదు అమ్ అద్మీ పార్టీకి చెందిన బహిష్కృత నేత, మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా. ఢిల్లీ అసెంబ్లీలో తనపై దాడి జరిగిందని.. బయటకు వచ్చిన తరువాత అరోపించారు. ఇటీవల అవినీతి అరోపణలను ఎదుర్కోన్న కపిల్ మిశ్రాను అప్ పార్టీ సస్పెండ్ చేసింది. తరువాత ఆయన తీరు నచ్చకపోవడంతో ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో అప్పటి వరకు మంత్రి పదవిని అనుభవించిన ఆయనకు అది కూడా దూరమైంది.

ఆ తరువాత ఏకంగా అమ్ అద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అవినీతి అరోపణలు చేసి మరి రచ్చ, రచ్చ చేశారు. అలాంటి కపిల్ మిశ్రా ఏకంగా ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశానికి హాజరుకాగానే అయనపై అగ్రహంతో వున్న అప్ ఎమ్మెల్యేలు ఆయనతో వాదనకు దిగారు. దీంతో ఆప్‌ నేతలకు, మిశ్రాకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మిశ్రాను సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయల్‌ ఆదేశించారు. మొండి వైఖరిని కనబర్చిన మిశ్రా అందుకు నిరాకరించారు.

అయితే మిశ్రా వెళ్లకుండా అక్కడే ఉండేసరికి శాసనసభ్యులు ఆయనపై ఊగిపోయారు. వారిని ఎత్తిపోడుస్తూ కపిల్ మిశ్రా ఏకంగా విమర్శలు చేశారు. దీంతో అప్ సభ్యులు మిశ్రాపై దాడి చేయడంతో అసెంబ్లీలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకోంది. దీంతో రంగంలోకి ప్రవేశించిన మార్షల్స్ మిశ్రాను బలవంతంగా బయటకు లాక్కువచ్చారు. ఈ క్రమంలో మిశ్రాపై దాడిని అడ్డుకునేందుకు ప్రత్యర్థి పార్టీల సభ్యలు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య కూడా తొపులాట జరిగింది.

అనంతరం మిశ్రా మీడియాతో మాట్లాడారు. ఆమ్‌ ఆద్మీకి చెందిన ఎమ్మెల్యేలు తనపై దాడి చేశారని అరోపించారు. తనను ఛాతిపై కొట్టారని, పిడిగుద్దులు గుద్దారని, ఇక మరికోందరు తనను తన్నారని కూడా ఆయన అరోపించారు. అప్పటికీ శాంతించని అప్ ఎమ్మెల్యేలు కోందరు తనను నెట్టేశారని అరోపించారు. ఆ సమయంలో కెమెరాలను స్విచ్ఛాఫ్‌ చేశారని ఆరోపించారు. అసెంబ్లీలో ఓ శాసనసభ్యుడిపై తోటి ఎమ్మెల్యేలు దాడి చేయడం ఇదే తొలిసారి అని విచారం వ్యక్తం చేశారు. సీఎం కేజ్రీవాల్‌ అవినీతి గురించి తాను స్పీకర్‌కు లేఖ రాశానని, అసెంబ్లీలో మాట్లాడేందుకు అనుమతినివ్వాలని తాను ముందుగానే కోరినట్లు మిశ్రా చెబుతున్నారు. కానీ తనపై ఇలా దాడి చేశారనని కపిల్ మిశ్రా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapil Mishra  Satyendra Jain  GST  Delhi Legislative Assembly  Arvind Kejriwal  AAP  

Other Articles