Babri Masjid case all accused granted bail బాబ్రీ మసీదు కేసులో బీజేపి అగ్రనేతలకు తాత్కాలిక ఊరట..

Babri masjid case advani joshi bharti and other accused granted bail

bail granted to bjp leaders, bail granted to advani, bail granted to uma bharathi, bail granted to mm joshi, bail granted to babri masjid accused, Babri Masjid case, Uma Bharti, Babri Masjid, MM Joshi, LK Adavni, Babri Masjid demolition case

A special CBI court in Lucknow granted bail to former deputy PM LK Advani, BJP veteran Murli Manohar Joshi and Cabinet minister Uma Bharti, along with nine other saffron leaders in the Babri Masjid demolition case

బాబ్రీ మసీదు కేసులో బీజేపి అగ్రనేతలకు తాత్కాలిక ఊరట..

Posted: 05/30/2017 01:01 PM IST
Babri masjid case advani joshi bharti and other accused granted bail

బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపి అగ్రనేత అద్వానీకి తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో అద్వానీ సహా మురళీ మనోహర్ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతి, వినయ్ కతియార్ సహా మొత్తం నిందితులైన 12 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నిందితులందరికీ రూ. యాభై వేల రూపాయల వ్యక్తిగత బాండ్ పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో బీజేపి అగ్రనేతలు, అర్ఎస్ఎష్ నాయకులకు తాత్కాలిక ఊరట లభించినట్లైంది.

కేసు పున:విచారణ సందర్భంగా సీబీఐ ఓ వైపు ఈ నెల 25వ తేదీన అదనపు అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో తాము కొర్టుకు హాజరుకాలేమని మినహాయింపు కోరిన నేతలకు ఇవాళ విచారణ ప్రారంభించనున్న నేపథ్యంలో తప్పక హాజరుకావాలని.. ఇక మినహాయింపులు ఇవ్వడం కుదరదని కూడా లక్నోలోని సీబిఐ ప్రత్యేక కోర్టుకు తేల్చిచెప్పింది. దీంతో ఇవాళ ఉదయం ఈ కేసులో నిందితులుగా వున్న నేతలు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.

ఈ ఉదయం ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కతియార్, సాధ్వీ రీతంబరా, విష్ణు హరిదాల్మియా, రాంజన్మభూమ్ి ట్రస్టు సభ్యుడు నృత్య గోపాల్ దాస్, రామ్ విలాస్ వేదాంతి, బైకుంథ్ లాల్ శర్మ అలియాస్ ప్రేంజీ, చంపత్ రాయ్ బన్సాల్, దర్మదాస్, సతీస్ ప్రధాన్ లు కోర్టుకు హాజరయ్యారు. కాగా, ఈ కేసులో రోజువారి విచారణను ప్రారంభించి.. గరిష్ఠంగా రెండు సంవత్సరాల్లో కేసును విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును బీజేపీ నేతలు కోరినప్పటికీ, కోర్టు అంగీకరించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Babri Masjid case  Uma Bharti  Babri Masjid  MM Joshi  LK Adavni  Babri Masjid demolition case  

Other Articles