Chhattisgarh Bride gets groom arrested for demanding dowry నవ వధువు ధైర్యాన్ని దాసోహమై సోషల్ మీడియా

Chhattisgarh groom demands refrigerator in dowry bride gets him arrested

bride gets groom arrested, groom arrested for demanding dowry, bride complaints on groom, Chhattisgarh, Groom, Bride, Wedding, Koriya Police, dowry demand, gold chain, refrigerator, arrest, Anand Soni

Chhattisgarh's Koriya Police arrested a groom after the bride filed a complaint against him over dowry demands, when he demanded a refrigerator and a gold chain after the wedding from her family.

పెళ్లైన 24 గంటలు తిరగకుండానే శివ్వంగిలా మారిన వధువు

Posted: 05/30/2017 02:24 PM IST
Chhattisgarh groom demands refrigerator in dowry bride gets him arrested

పెళ్లై 24 గంటలు కూడా కాలేదు. ఇంకా తమ బంధువులు, పెళ్లి కొడుకు తరుపు బంధవులు అందరూ పందిట్లోనే వున్నారు. పెళ్లి కొడుకు తరపు బంధవులతో పెళ్లి కూతురు తరపు తల్లిదండ్రులు, బంధువులు ఏదో అంశమై తీవ్రంగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలో తన మెడలో తాళి కట్టిన భర్త కూడా అక్కడే వున్నాడు. అయనను తన తల్లిదండ్రులు బతిమాలుతున్నారు. వారు మాట వినకుండా ఏకంగా వెళ్లిపోతున్నారు. వారితో పాటు వెళ్లాల్సిన తాను.. అక్కడే వుండిపోయింది.

దీంతో తల్లిదండ్రులు, బంధువులు, అందరూ దు:ఖసాగరంలో మునిగారు. ఇదంతా పక్కనుండి చూసిన పెళ్లి కూతరు ఒక్కసారిగా శివ్వంగిలా మారింది. తనతో పాటు తనలాంటి యువతులు ఎదుర్కోంటున్న ఈ సామాజిక రుగ్మతపై అమె కదం తొక్కింది. తల్లిదండ్రులు, ఇరుగుపోరుగువారు, బంధువులు వారించినా.. అమె వినిపించుకునే ప్రయత్నం చేయలేదు.. సరికాదా.. వెనక్కు తగ్గలేదు.. మడప తిప్పలేదు. ఏకంగా తాను ఎదుర్కొన్న సమస్యపై పోలీసుకలు పిర్యాదు చేసింది.

పసుపుపారాణితో భర్తతో కలసి వెళ్లాల్సిన నవ వధువు పోలిస్ స్టేషన్ కు ఎందుకు వెళ్లింది. అక్కడ ఏమని పిర్యాదు చేసింది. అసలు అమెతో పాటు అమెలాంటి అనేక మంది యువతులు ఎదుర్కోంటున్న సమస్య ఏమిటీ..? అంటే వరకట్నం. డబ్బు కుదరక చెప్పిన ప్రకారం కట్నం ఇవ్వలేకపోయిన వదువు తల్లిదండ్రులు.. మరికొన్ని రోజుల్లో కట్నం ఇస్తామని చెప్పినా వినకుండా వరుడు, అతని కుటుంబ సభ్యలు.. వధువును పెళ్లింటే వదిలేసి.. కట్నం ఇచ్చినప్పుడే అమెను తీసుకెళ్లామని చెప్పి వెళ్లిపోయారు.

దీంతో అమె తల్లిదండ్రులు, బంధుమిత్రలు కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమ తాహత్తుకు మించి పెళ్లి చేసి, కట్నకానుకలు ఇచ్చినా.. తమ బిడ్డ ఇంటే వుండిపోయిందని అందోళన చెందారు. అయితే ఈ పరిణామాలను అన్నింటినీ గమనించిన వధువు ఒక్కసారిగా శివ్వంగిలా మారింది. ‘కట్నానికి ఆశపడే వీడు నాకు వద్దేవద్దు..’అని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన భర్త, అత్తమామాలపై పిర్యాదు చేసింది. తల్లిదండ్రులు వారించినా, బంధుమిత్రులు వద్దని సూచించినా వినిపించుకోకుండా ఫిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వరుడితో సహా వారి తల్లిదండ్రులపై వరకట్నం వ్యతిరేకంగా పలు సెక్షన్లల కింద కేసు నమోదు చేసి, ఇవాళ వరుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. కాగా, నవ వధువు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు అమెకు నెట్ జనులు దాసోహం అంటున్నారు. సామాజిక రుగ్మతలపై అనేక మంది మాట్లాడుతారని, కానీ ఎవ్వరూ ఇలా ధైర్యంగా నిలబడలేరని అమెకు ‘సాహో..’ అంటూ సలామ్ చేస్తున్నారు. వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా పోరాడిన ఆమెను దేశంయావత్తూ అభినందిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chhattisgarh  Groom  Bride  Wedding  Koriya Police  dowry demand  gold chain  refrigerator  arrest  Anand Soni  

Other Articles