women eloped with lover leaving family turns thief కాపురాన్ని కాదంది.. కటకటాల్లోకి చేరింది..

Women eloped with lover leaving family turns thief

married women turns thief, married women leaves husband for being rich, married women elopes with lover, married women stealing mobile phone, married women padma, nizamabad married women, padma elopes with pavan kumar, chadarghat police, hyderabad news, crime news, Telangana

A married women who dreamed about being rich, eloped with lover leaving family atlast turns thief as police caught her stealing colleagues mobile phone in hostel.

కాపురాన్ని కాదంది.. కటకటాల్లోకి చేరింది..

Posted: 05/26/2017 11:49 AM IST
Women eloped with lover leaving family turns thief

పెళ్లికి ముందు ఎలా తిరిగినా.. ఎలా జల్సాలను చేసుకున్నా.. పెళ్లైన తరువాత మాత్రం భర్తకు భార్యా పిల్లలే లోకం. అదే భార్యకు కూడా భర్త పిల్లేలే ప్రపంచం. ఈ విషయంలో భర్తల కన్నా భార్యలే తమ కుటుంబాల ఉన్నతి కోసం.. తమ సంతానం క్రమశిక్షణ కోసం ఎక్కువగా కష్టపడుతుంటారు. అయితే నిజామాబాద్ కు చెందిన పద్మ మాత్రం ఇందుకు భిన్నంగా చేసింది. భర్తతో హాయిగా కాపురం చేయకుండా.. కటకటాల్లోకి చేరింది. పదేళ్ల వివాహం తరువాత ముగ్గురు సంతానం కల్గినా.. ఇంకా కాపురాన్ని కూల్చుకునే చర్యలను మాత్రం వీడలేదు.

భర్త పిల్లలతో సంతోషంగా కాపురం చేసుకోవడం కన్నా తన జల్సాలే ముఖ్యమనుకుంది. పదేళ్ల వైవాహిక జీవితంలో అమె ఏమాత్రం మారలేదు. భర్త, పిల్లల క్షమాన్ని కాంక్షించలేదు. సంతనం పట్ల శ్రద్ద తీసుకోనే లేదు. భర్తను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంతసేపు కలల ప్రపంచంలో విహరించి.. అందుకు మార్గాలను మాత్రమే అన్వేషించేంది. పెళ్లికి ముందు చేసిన సరదాలు, షికార్లను కోరుకునేది. ఈ క్రమంలో రెండు సార్లు భర్తను వదిలేసి వెళ్లిపోయింది. తిరిగి తిరిగి మళ్లీ భర్త పంచన చేరేందుకు వచ్చింది. అయినప్పటికీ భర్త పెద్ద మనస్సుతో తన భార్య న్న మమకారం, తన పిల్లలకు తల్లి అనురాగం కోసం అమెను క్షమించి, ఇంటికి తెచ్చుకున్నాడు.

ఇంత చేసినా అమె కుదురుకోలేదు. మళ్లీ అమె పాత మార్గంలోనే పయనించింది. కొన్నాళ్ళకు అదే ప్రాంతంలో ఉండే తనకన్నా చిన్న వయస్కుడైన పవన్ కుమార్ తో పరిచయం పెంచుకుంది. అతనితో పాటు ఇళ్లు, భర్త, పిల్లలను వదిలేసింది. పవన్ కుమార్ అమెను దిల్ షుక్ నగర్, గడ్డి అన్నారంలోని ప్రగతి ఉమెన్స్ హాస్టల్ లో స్టూడెంట్ అని చెప్పి ఆమెను చేర్పించాడు. కొన్నాళ్ల వీరు హ్యాపీగానే ఎంజాయ్ చేశారు. ఇల్లు వదిలి వచ్చేప్పుడు భర్త నుంచి తెచ్చుకున్న 40,000 రూపాయలు ఖర్చైపోయాయి. అయితే భర్త దరి చేరడం ఇష్టం లేక ఏం చేద్దామని ప్రియుడినే సలహా అడిగింది.

హాస్టల్‌ ఫీజు చెల్లించేందుకు, ఇతర అవసరాలు తీర్చుకునేందుకు డబ్బు లేదు. ఎలా అనగానే ప్రియుడు అమెకు ఓ ఉచిత సలహా ఇచ్చాడు. దాంతో దానిని అమలు పర్చింది. అయితే అప్పటి వరకు హాస్టల్‌ లో తోటీ విద్యార్థుల వస్తువులు ఏవీ పోలేదు. కానీ ప్రియుడి సూచనతో పద్మ తన చేతివాటం బాగానే ప్రదర్శించింది. తోటి విద్యార్థినుల సెల్‌ ఫోన్లు, బంగారు గొలుసులు చోరీ చేయడం మొదలు పెట్టింది. బాధితులు, హాస్టల్ వార్డెన్ ఫిర్యాదుతో నిఘా ఉంచిన పోలీసులు, సెల్ చోరీ చేస్తుండగా పద్మను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విచారణలో ప్రియుడు పవన్‌ కుమార్‌ సూచనతోనే దొంగతనం చేస్తున్నట్టు తెలిపింది. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు. వారి నుంచి 3 సెల్‌ ఫోన్లు, ఆరు గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : padma  pavan kumar  illicit affair  chadarghat police  pragathi womens hostel  crime  

Other Articles