former cji demands dismiss of chandrababu government బాబు సర్కారును భర్తరఫ్ చేయాల్సిందేనా..!

Former cji demands dismiss of chandrababu government

social media, markandey katju, inturi ravikiran, chandrababu, AP government, unconstitutional arrests, President president, PMO, prime minister office, PM Modi

former supreme court judge justice markandey katju appeals president and pmo demanding dismiss of chandrababu government over the unconstitutional arrests of cartoonists.

బాబు సర్కారును భర్తరఫ్ చేయాల్సిందేనా..!

Posted: 05/17/2017 01:18 PM IST
Former cji demands dismiss of chandrababu government

ఆంద్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వాన్ని తక్షణం భర్తరఫ్ చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ద్వారా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా అపీలు చేశారు. ఆంద్రప్రదేశ్ లో అప్రజాస్వామిక పాలన సాగుతుందని, ప్రభుత్వాన్ని విమర్శించిన కార్టూనిస్టులపై కేసులు బనాయించి కటకటాల వెనక్కి పంపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవికిరణ్‌ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. సోషల్‌ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్ట్‌ రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు. కార్టూన్లు అనేవి భావ స్వేచ్ఛ ప్రకటనలో ఓ భాగమని కట్జూ  అన్నారు.
 
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉందని ఆయన అన్నారు. ఆర్టికల్ 19 (1) ఏ కింద ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్నారు. ప్రజాస్వామ్య విధానంలో రాజకీయవేత్తలను విమర్శించే హక్కు ప్రజలకు ఉందని, ఇక్కడ ప్రజలే ప్రభువులని కట్జూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు అనాగరికం, అప్రజాస్వామికమని, ఏపీ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సర్కార్‌పై ఆర్టికల్‌ 356 ప్రయోగించాలని అని కట్జూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఆయన లేఖ రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles