Groom Arrested After His Lover Messages Bride వరుడి ప్రేమ బాగోతం తెలిసిన వధువు ఏం చేసిందో తెలుసా.?

Bride refuses to marry groom after recieving his girlfriends message

bridegroom rejected marriage, bride refuses marriage, bride alerted police, bride knows grooms affair just before marriage, bride, bridegroom, girl friend, message, warangal, krishna, peta bharath kumar, crime

The young bride not only refused to marry the groom, but her family also complaints to police after recieving a message from his girl friend.

వరుడి ప్రేమ బాగోతం తెలిసిన వధువు ఏం చేసిందో తెలుసా.?

Posted: 05/14/2017 11:32 AM IST
Bride refuses to marry groom after recieving his girlfriends message

యువతీ యువకుల జీవితాల్లో పెళ్లి అనే రెండు అక్షరాల బంధంపై ఎన్నో అశలు, ఎన్నో ఊహాలు, మరెన్నో కోరికలు.. ఇలానే అనేక కోరికలతో పెళ్లి పందిట్లోకి వచ్చిన పెళ్లికూతురు.. ఇక కారు దిగుతున్న సమయంలో అమె ఫోన్ కు ఓ మేసేజ్ వచ్చింది. తన పెళ్లికి రాలేని వారు గ్రీటింగ్స్ పంపారేమోనని, దానిని వెంటనే చూసింది. అంతే దాంతో పెళ్లి అర్ధంతరంగా ఆగిపోయింది. ఇంతకీ అ మెసేజ్ పంపిందెవరు..? అ మేసేజ్ లో ఏముంది..? అసలు పెళ్లి అర్థంతరంగా అగిపోవడానికి కారణమేంటి..?

ఆ మేసేజ్ వచ్చింది వరుడి ప్రియురాలి నుంచని తెలుసుకున్న వధువు షాక్ కు గురైంది. విషయాన్ని తమ తల్లిదండ్రులు, బంధువులకు తెలియజేసింది. గతంలో పెళ్లి కుమారుడికి మరో యువతితో సంబంధం ఉందనే విషయం స్వయానే అతని ప్రియురాలే ఆమేకు మెసేజ్‌ చేసిందని అందుకు తగిన సాక్షాధారాలు కూడా మేసేజ్ తో పంపింది. దీంతో అప్రమత్తమైన వధువు పెళ్లి ఆపేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నగరంలోని రామన్నపేటకు చెందిన యువతికి కృష్ణాజిల్లాకు చెందిన పేట భరత్‌ శ్రీనివాస్‌తో పెళ్లి నిశ్ఛయమైంది.

ఖాజీపేటలోని శ్యామల గార్డెన్స్ లో పెళ్లికి ఇరు కటుంబాలతో వారి బందువులు కూడా చేరుకున్నారు. అంతలో పెళ్లి కూతురు ఫోన్ కు బరత్ శ్రీనివాస్ ప్రియురాలు పంపిన మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌ చదివిన అనంతరం తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెద్దలకు చెప్పింది. గతంలో ఓ అమ్మాయి జీవితంతో ఆడుకొని పెళ్లికి సిద్ధమైన పెళ్లి కొడుకును పోలీసులకు పట్టించింది. విషయం తెలుసుకున్న సుబేదారి పోలీసులు పెళ్లి మండపానికి చేరుకొని పెళ్లి కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

పేట భరత్‌ శ్రీనివాస్ విజయవాడలోని హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ ఆస్పత్రిలో రిలేషన్ షిప్‌ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సునిత అనే యువతితో ప్రేమ వ్యవహరం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో వాళ్లు చూసిన యువతిని పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న సునిత పెళ్లి కూతురి ఫోన్‌ నంబర్ కనుక్కొని పూర్తి వివరాలతో ఆమెకు మెసేజ్‌ పంపడంతో పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bride  bridegroom  girl friend  message  warangal  krishna  peta bharath kumar  crime  

Other Articles