Nawaz Sharif's Daughter Tweets over Panamagate

Panama papers were never about corruption

Nawaz Sharif, Nawaz Sharif Daughter, Maryam Nawaz Sharif, Panamagate Nawaz Sharif, Nawaz Sharif Daughter Political Debut, Maryam Nawaz Next PM, Maryam Nawaz Politics, Aitzaz Ahsan Maryam Nawaz Sharif, Maryam Nawaz Sharif Fire, Maryam Nawaz Sharif, Pakistan Next PM, Maryam Nawaz Tweets, Maryam Nawaz Husband, Maryam Nawaz Age, Maryam Nawaz Daughter, Maryam Nawaz Twitter

Nawaz Sharif's Daughter Maryam Nawaz Sharif tweets create new debate. Triggers Twitter war over Panamagate. Aitzaz Ahsan says If Nawaz resigns, Maryam will take his place.

ప్రధానిపై కుట్ర చేస్తే మట్టికొట్టుకుపోతారు

Posted: 05/04/2017 07:59 AM IST
Panama papers were never about corruption

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియమ్‌ నవాజ్ రాజకీయ రంగ ప్రవేశం దాదాపు ఖరారైనట్లే అనిపిస్తోంది. పనామా పేపర్ల వ్యవహారంలో నవాజ్ అక్రమాల గురంచి వెలుగు చూడటం, కోర్టు విచారణకు ఆదేశించటంతో దిగిపోవాల్సిందేనంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరయమ్ తండ్రికి మద్ధతుగా చేసిన ట్వీట్లు ఆమె రాజకీయ ఆరంగ్రేటాన్ని సూచిస్తున్నాయి.

తన తండ్రిని దెబ్బతీయాలనుకున్నవాళ్లు మట్టికరిచిపోతారంటూ మరియమ్‌ నవాజ్ ట్విట్టర్ లో మండిపడింది. పనామా పత్రాలు ఉత్త చెత్త అని ఆమె పేర్కొన్నారు. వాటిని చెత్తకుప్పలో వేయాలని, అస‌లు పనామా పత్రాలు అవినీతికి సంబంధించినవి కావని ఆమె ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. అయితే, దీనిపై జర్మన్‌ ఇన్వేస్టిగేటివ్‌ జర్నలిస్టు బాస్టియన్‌ ఒబెర్మేయర్ కూల్‌గా స్పందించారు.

'మీకు ఈ విషయం చెబుతున్నందుకు సారీ' అని అంటూ పనామా పత్రాలు అవినీతికి సంబంధించినవేన‌ని స‌మాధానం ఇచ్చారు. ఆశ్చర్యకరమైన రీతిలో అవినీతి కేసులను ఈ పత్రాల ద్వారా తాము కనుగొన్నామ‌ని, అవ‌న్నీ నిజమైనవేన‌ని బదులిచ్చి ఝ‌ల‌క్ ఇచ్చాడు. ఇక ఒకవేళ షరీఫ్ గనుక రాజీనామా చేయాల్సిన పరిస్థితే వస్తే మాత్రం మరయమ్ ప్రధాని అవుతుందని పీపీపీ ప్రతినిధి అతిజాజ్ అహ్ షన్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఇప్పటికే ఆమెను పార్లమెంట్ కు పంపేందుకు నవాజ్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడని అందులో అతిజాజ్ వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nawaz Sharif  Maryam Nawaz Sharif  Panamagate  Tweets  

Other Articles