Yogi Adityanath warns officers he can call on landline anytime.

Officers warned yogi adityanath call on landline too

Yogi Adityanath, Yogi Adityanath Land Line, Yogi Adityanath Warn, Yogi Adityanath Government Officials, Yogi Adityanath Land Line, Yogi Adityanath Phone Calls, Yogi Adityanath Governance, Yogi New Rules, Uttar Pradesh Chief Minister, Uttar Pradesh Government Oficials, Yogi Land Line Call

Uttar Pradesh Chief Minister Warns Government Officials. Yogi Can call you at any time on landline Minister Shrikant Sharma Said.

ల్యాండ్ ఫోన్ రింగ్ అయితే ఇక వణికిపోవటమే...

Posted: 04/28/2017 06:11 PM IST
Officers warned yogi adityanath call on landline too

దశాబ్దాలుగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేకుండా పోయి ఒకానోక టైంలో కేంద్రం వల్ల కూడా కాక చేతులేత్తేసిన ఉత్తర ప్రదేశ్ ను దారిలో పెట్టేందుకు సీఎం యోగి ఆదిత్యానాథ్ తెగ ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో అధికారులు నిద్ర లేకుండా చేస్తున్న ఆయన సత్ఫలితాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నపళంగా ఊడిపడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తూ అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఇక ఇప్పుడు పరిపాలన పై పూర్తి స్థాయిలో దృష్టి సారించి అధికారుల భరతం పట్టే పనిలో నిమగ్నమయ్యాడు.

ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారుల గైర్హాజరీ, ఇష్టా రాజ్యంగా వ్యవహరించటంలాంటి, కునుకు పాట్లు తీయటాలు వగైరా వేషాలు ఇకపై కుదరబోవనే సంకేతాలను అందించాడు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా విధులు తప్పని సరిగా నిర్వహించాలని, ఆలస్యం చేసినా, డుమ్మా కొట్టినా వాళ్ల ఉద్యోగాలకే ఎసరు పెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. మంత్రి శ్రీకాంత్ శర్మ ఈ మేరకు అన్ని కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశాడు.

సీఎం కార్యాలయం నుంచి ఏ క్షణంలోనైనా మీ ల్యాండ్ ఫోన్ రింగ్ కావొచ్చు. అప్రమత్తంగా ఉండండి. స్వయంగా సీఎం యోగినే మీతో మాట్లాడతారు. తేడా వస్తే మీ ఉద్యోగాలు ఊడతాయి అని ఆర్డర్ లో ఉంది. 44 ఏళ్ల యోగి అవసరమైతే 18 నుంచి 20 గంటల పాలనకు సిద్ధంగా ఉండాలని ఇదివరకే అధికారులకు సంకేతాలు పంపిన విషయం తెలిసిందే. అలా సిద్ధం కానీ పక్షంలో వారంతా ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలని ఆదేశించాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  CM Yogi Adityanath  Government Officials  Land Line Call  

Other Articles