truck falls on an auto from flyover in Jalandhar అదుపు తప్పి అటో పైబడిన లారీ..

Caught on cam truck falls from flyover in jalandhar

miraculous escape for cyclist, miraculous escape for commuter, miraculous escape, truck falls from flyover, jalandhar flyover accident, flyover, Jalandhar, truck driver, cyclist, auto rickshaw driver, cctv footage, Punjab, viral video

In a shocking incident, two persons were severely injured after having a narrow escape when a truck fell off from a flyover in Jalandhar city of Punjab

ITEMVIDEOS: అటో పైబడిన లారీ.. వెంట్రుకవాసిలో తప్పించుకున్న సైకిలిస్టు

Posted: 04/28/2017 04:52 PM IST
Caught on cam truck falls from flyover in jalandhar

అతివేగం ప్రమాదాలకు కారణం.. నిదానమే ప్రధానం అని జాతీయ రహదారులకపై రాసిన మాటలను అలకించరు వాహనదారులు. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే ట్రక్కు డ్రైవర్లు మాత్రం వీటిని చూసి ఇలాంటివి తమ సర్వీసులో ఎన్ని చూడలేదు అని అనుకుంటారు. కానీ.. అలాంటి ఘటనలు ఎదరై.. ప్రాణాలతో వున్నప్పుడే.. ఆ బోర్డులు చసినప్పుడైనా వేగాన్ని నియంత్రించాల్సింది.. అలా చేయకపోవడం వల్లే ఇలా ప్రమాదం భారిన పడాల్సి వచ్చింది అనుకునేవాళ్లు అనేకం.

అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయమేంటంటే.. ప్రాణాలతో మిగిలిన్నామన్నదే. ఇంకా భూమ్మీద నూకలున్నాయి కాబట్టే ఇలా బతికిపోయాం లేదంటే ఏం జరిగేది అలోచించడానికే అసాధ్యం. సరిగ్గా ఇలాంటి ప్రమాదం బారిన పడ్డాడు ఓ ట్రక్కు డ్రైవర్. వేగంగా వెళ్తూ.. అదుపు తప్పి పక్కన రోడ్డుపై వెళ్తున్న మరో వాహనంపై పడి వారిని విషమ పరిస్థితులకు గురిచేసి తాను అదే స్థితిలో కొనసాగుతున్నాడు.

పంజాబ్ లోని జలందర్ రోడ్డులో ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తున్న లారీ.. అతివేగంగా దూసుకెళ్లి.. అదుపు తప్పింది. అంతే ఒక్కసారిగా ఫ్లైఓవర్ పై నుంచి కింద పడింది. అదే సమయంలో కింద రోడ్డుపై వెళ్తున్న అటోపై లారి పడటంతో లారీ డ్రైవర్ తీవ్రగాయాలపాలయ్యాడు. ఇక ట్రక్కు డ్రైవర్ కూడా తీవ్రగాయాలపాలు కావడం.. ఇద్దరి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం బారి నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్న అదృష్టవంతులు ఇద్దరు.

వీరిద్దరూ తమ వైపు దూసుకొచ్చిన ప్రమాదం నుంచి రెప్పపాటుకాలంలో బయటపడ్డారు. వీరిని కాపాడింది రోడ్డపై నిలిపిన మరో ట్రక్కు కావడం గమనార్హం. ప్లైఓవర్ పైనుంచి లారీ కింద పడిన సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ సైకిలిస్టు తో పాటు అక్కడే ఉన్న మరో వ్యక్తి ఇద్దరు ఒక్కసారిగా పక్కకు తప్పుకునే ప్రయత్నంలోకి జారుకున్నాడు. అంతలోగే పెద్ద ట్రక్కు ప్లై ఓవర్‌ మీద నుంచి పెద్ద శబ్దంతో పడిపోయింది.

అది చూసి వారి గుండెలు అదిరిపడ్డాయి. సైకిల్ పోతే పోయింది.. తన ప్రాణాలు దక్కాయని సైకిలిస్టు, అక్కడే వున్న మరో వ్యక్తి పరుగు లంఖించుకుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కాగా, ప్లైఓవర్‌పై నుంచి కిందపడిన ట్రక్కులో ఒక డ్రైవర్‌, అదే సమయంలో అటుగా వస్తున్న అటో డ్రైవర్ ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడం అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : flyover  Jalandhar  truck driver  cyclist  auto rickshaw driver  cctv footage  Punjab  viral video  

Other Articles