అల్రెడీ ఉరి తీసేశారా? పాక్ డ్రామా ఆడుతోందా? అనుమానాలు ఎందుకంటే... | Fear That Kulbhushan Jadhav Has Been Killed.

Kulbhushan jadhav has been tortured and murdered in pakistan

R K Singh, R K Singh Kulbhushan Jadhav, Kulbhushan Jadhav Death Sentence, Kulbhushan Jadhav Hang, Kulbhushan Jadhav Drama, Kulbhushan Jadhav Pakistan, Kulbhushan Jadhav India, Kulbhushan Jadhav Bilawal Bhutto, Pakistan Capital Punishment

Ex-union Home secy, BJP MP R K Singh raised doubts on Kulbhushan Jadhav death semtence episode. Pakistan may be fabricating trial story; Kulbhushan might be 'dead'. Besides this Bilawal Bhutto says his party PPP against capital punishment.

భూషణ్‌ ఉరి.. పాక్ డ్రామాలాడుతోందా?

Posted: 04/12/2017 07:53 AM IST
Kulbhushan jadhav has been tortured and murdered in pakistan

భారత గూఢాచారి అంటూ బెలుచిస్థాన్ లోని చమాన్ ప్రాంతం వద్ద అరెస్టై, పాక్ లో బందీగా మారి, ఇప్పుడు ఉరిశిక్ష విధించబడ్డ భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్ బతికి ఉన్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాదవ్ ను పాక్ చిత్రహింసలు పెట్టి చంపేసి ఉండొచ్చని బీజేపీ ఎంపీ, హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.సింగ్ అంటున్నాడు. పాక్ వైఖరిని మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాం. తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలు ఆడే ఆస్కారం లేకపోలేదు సింగ్ చెబుతున్నాడు.

కులభూషణ్ విషయంలో 13 సార్లు భారత్ విజ్నప్తి చేసింది. అయినా పరిగణనలోకి తీసుకోని పాక్ ఉన్నపళంగా ఉరిశిక్ష అంటుండటమే అందుకు కారణమని వివరించాడు. చివరకు ఆయన్ను కలుసుకునేందుకు కూడా భారత రాయబార అధికారులకు అనుమతి ఇవ్వకపోవటం అందుకు మరింత బలం చేకూరుస్తుందని వివరించాడు. గతంలో పలువురు ఖైదీలు చెప్పిన అనుభవాల దృష్ట్యా ఆయనను చిత్రహింసలు పెట్టి చంపేసి ఉంటారని సింగ్ తెలిపాడు.

ఆయన బతికి ఉన్నాడా? లేదా? అన్నది నిర్ధారించేందుకు భారత రాయబార కార్యాలయానికి అనుమతి ఇవ్వాలంటూ మరోసారి గట్టిగా పాక్‌ను భారత ప్రభుత్వం కూడా డిమాండ్ చేయాలని ఆయన సూచించాడు. కేంద్రం తర్వపడని పక్షంలో కుల్ భూషణ్‌ జాదవ్ ను ఉరి తీసేసామంటూ పాకిస్థాన్ రేపే ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు.


ఇక భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌కు పాక్ మరణశిక్ష విధించడాన్ని భారత్ తీవ్రంగా నిరసించిన నేపథ్యంలో పాకిస్థాన్ స్పందించింది. మరణశిక్షపై జాదవ్ అప్పీలు చేసుకోవచ్చని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా, పాక్ అధ్యక్షుడు మామున్ హుస్సేన్‌లకు 60 రోజుల్లోగా అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు.

భారత నిఘా సంస్థ ‘రా’ తరపున జాదవ్ గూఢచర్యం చేస్తున్నట్టు తేలడం వల్లే పాక్ మిలటరీ కోర్టు ఆయనను దోషిగా తేల్చి మరణశిక్ష విధించినట్టు ఆసిఫ్ పేర్కొన్నాడు. ఈ విషయంలో పాక్ ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రశ్నే లేదని స్పష్టం చేశాడు. మరోవైపు నిన్న పార్లమెంట్ లో రచ్చ చేసిన ఈ అంశంపై ప్రభుత్వం కూడా గట్టి వివరణే ఇచ్చింది. కులభూషణ్ హిందుస్థాన్ కా భేటా అని చెప్పిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఎలాంటి హని తలపెట్టినా సహించే ప్రసక్తే లేదని పాక్ కు గట్టి వార్నింగే ఇచ్చింది.

ఉరికి మేం వ్యతిరేకం: భుట్టో తనయుడు

పాక్ మాజీ ప్రధాని దివంగత బెనజీర్ భుట్టో తనయుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ కులభూషణ్ ఉరిశిక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. తన తాత జుల్ఫికర్ అలీ భుట్టో ఉరిని గుర్తు చేస్తూ మరణశిక్షను తాము మొదటి నుంచి వ్యతిరేకమని ప్రకటించాడు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం జాదవ్ పై నెలకొన్న ఆరోపణలను ప్రపంచానికి తెలియజేయని నేపథ్యంలో అతన్ని నిర్దోషిగానే భావించాల్సి ఉంటుందని, గతంలో ఇండియా పాక్ తరపున అరెస్ట్ చేసిన వారి విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించిందని, అలాంటప్పుడు ఇక్కడి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించటం సరికాదన్న అభిప్రాయం బిలావల్ వ్యక్తం చేశాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Kulbhushan Jadhav  Bilawal Bhutto  Death Sentence  

Other Articles