నటి రాధిక రాడాన్ సంస్థపై ఐటీ అధికారుల దాడులు income tax sleuths raid actor Radhika Sarathkumar's office

It raids tamil actress radhika sarathkumar s radaan mediaworks

Income Tax department, I-T raid, RK Nagar, RK Nagar bypoll, Tamil Nadu, J Jayalalithaa, Chennai, Sarathkumar, Radhika Sarathkumar, Radaan

The Income Tax department raided the office of Radhika Sarathkumar, the wife Sarath Kumar, a day after he was summoned and questioned by the I-T department.

నటి రాధిక రాడాన్ సంస్థపై ఐటీ అధికారుల దాడులు

Posted: 04/11/2017 08:48 PM IST
It raids tamil actress radhika sarathkumar s radaan mediaworks

ప్రముఖ సినీ నటి రాధిక చిక్కుల్లో పడ్డారు. ఆమె సొంత సంస్థ రాడాన్ మీడియా వర్క్స్‌పై ఐటీ అధికారులు ఇవాళ మధ్యాహ్నం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అమె భర్త, నటుడు, రాజకీయ పార్టీ నేత అయిన శరత్ కుమార్ ఇంటిపై దాడులు జరిపిన మూడు రోజుల తరువాత ఆయన సతీమణి నివాసంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రాధిక నివాసంతో పాటు త్యాగరాయనగర్ లో వున్న అమె సొంత సంస్థ రాడాన్ మీడియా వర్క్స్ పై దాడులు చేయడం కలకలం రేపుతోంది.

నటిగా సినిమాలు, టీవీ సీరియల్ చేస్తున్న రాధిక, తన సొంతం నిర్మాణ సంస్థ రాడన్ ద్వారా పలు సీరియల్లను సినిమాలను నిర్మిస్తోంది.  ఈ సంస్థ కు చెందిన టీ నగర్‌లోని కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడంతో ఈ వార్త తమిళనాట సంచలనంగా మారింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లు పెద్ద మొత్తంలో డబ్బులు పంచిపెడుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారనిఅరోఫణలతో రంగంలోకి దిగిన ఐటీ శాఖ తమిళనాడు వైద్యఅరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ నివాసంతో పాటు శరత్ కుమార్ నివాసం, వైస్ చాన్సిలర్ గీతాలక్ష్మీ నివాసంలోనూ ఐటీ దాడులు చేసిన విషయం తెలిసిందే.

శశికళ వర్గం నుంచి బరిలోకి దిగిన దినకరన్‌కు మద్దతు పలికిన శరత్‌కుమార్ ఆయనను కలిసి అభినందించారు. సరిగ్గా ఆ తర్వాతి రోజే ఆయన ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. అలాగే మంత్రి విజయభాస్కర్ ఇంటిపైనా దాడులు చేసిన అధికారులు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా రాడాన్ సంస్థపైనా దాడులు చేశారు. ఆర్కేనగర్‌లో ఉప ఎన్నికలో ధనప్రవాహాన్ని గుర్తించిన ఎన్నికల సంఘం ఉప ఎన్నికను వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles