ఇండిగో ఆఫర్.. రూ.999 లకే విమానయానం.. Special fares by IndiGo for summer vacations

Special fares by indigo for summer vacations

IndiGo, IndiGo Rs 1119, IndiGo Rs 1199, IndiGo offer, IndiGo Summer Vacations, IndiGo Rs 1200 offer, flight tickets, Rs 999 offer, IndiGo discounted fares

Amid increasing competition on the back of robust passenger traffic in the Indian aviation market, IndiGo is offering special discounted fares starting Rs. 1,119 on select flights in a promotional scheme.

ఇండిగో ఆఫర్.. రూ.999 లకే విమానయానం..

Posted: 04/11/2017 05:59 PM IST
Special fares by indigo for summer vacations

అత్యంత చౌకైన ధరల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న సంస్థగా పేరొందిన ఇండిగో విమానాయాస సంస్థ దూసుకుపోతుంది. తమ ప్రయాణికులతో పాటు కొత్త ప్రయాణికులను కూడా అకర్షించేందుకు సిద్దమైంది. ఈ నెల 10 నుంచి 12 వరకు తమ కస్టమర్లకు సమ్మర్ వెకేషన్ ఆపర్ ను తీసుకువచ్చింది. ఇటీవలే 900 విమానాలను ఒకే రోజు ఆపరేట్ చేసి దేశీయ విమానయాన రంగం చరిత్రలో సంచలనం సృష్టించిన ఇండిగో అదే ఊపులో స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది.

ఈ ఆపర్ కింద అన్ని ధరలను కలుపుకుని విమాన టిక్కెట్ ను కేవలం 999 రూపాయలకే అందించనుంది. మూడు రోజుల ''సమ్మర్ వొకేషన్ ఆఫర్'' కింద అన్ని నెట్ వర్క్ పరిధిలో దీన్ని వర్తింపజేస్తోంది. 6ఈ నెట్ వర్క్ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు తక్కువ ధరల్లో ఇండిగో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. 2017 ఏప్రిల్ 10 నుంచి 2017 ఏప్రిల్ 12 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్ లైన్ పేర్కొంది. 2017 మే 1 నుంచి జూన్ 30కి మధ్యలో ప్రయాణాలకు ఎంపికచేసిన ప్రాంతాలకు మాత్రమే ఇది వర్తిస్తుందట.

ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ తో ఈ స్పెషల్ ఫేర్స్ అందుబాటులో ఉంటాయని, ఒక్కసారి టిక్కెట్ కు చెల్లించిన ఛార్జీలు మళ్లీ రీఫండ్ చేయమని పేర్కొంది. ఇదిలా కోనసాగుతున్న తరుణంలోనే ప్రమోషనల్ ఆపర్ కింద మరో ఆపర్ ను కూడా ప్రకటించింది. ఈ ఆపర్ కింద రూ. 1119 లకే ప్రయాణాలను అందిస్తుంది. అయితే ఎంపిక చేసిన రూట్లలో.. ఎంపిక చేసిన రోజుల్లోనే ఇవి వర్తిస్తాయని కూడా సంస్థ ఓఒ ప్రకటనలో పేర్కోంది. 44 ప్రాంతాలకు చక్కర్లు కొడుతున్న ఈ సంస్థ మొత్తం 907 డైలీ ఫ్లైట్స్ ను కలిగి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IndiGo  flight tickets  Rs 999 offer  summer vacation  discount fares  

Other Articles