షిరిడీ సాయి భక్తులకు శుభవార్త.. వాయుమార్గం సుగమం Shirdi airport set to take off in May

Shirdi airport set to take off in may

Shirdi airport, Shiridi Sai, Sai devotees, Saibaba devotees, Ahmednagar, maharashtra airport company limited, MADC, Delhi, Mumbai, Hyderabad, domestic flights, International flights, Shiridi sai Darshan, saibaba airport

Shirdi airport in Ahmednagar district will be the first airfield developed and managed by the Maharashtra Airport Development Company Limited (MADC).

షిరిడీ సాయి భక్తులకు శుభవార్త.. వాయుమార్గం సుగమం

Posted: 04/11/2017 06:51 PM IST
Shirdi airport set to take off in may

షిరిడీ సాయిబాబా భక్తులు వేయి కళ్లతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు కేంద్ర విమానయాన సంస్థ సాయిబాబా భక్తులకు శుభవార్తను అందించింది. వచ్చే నల నుంచి షిరిడీకి విమానయాన సేవలు ప్రారంభం కానున్నాయి. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, దేశ అర్థిక రాజధాని ముంబై, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లాంటి ముఖ్యనగరాలకు చెందిన ప్రయాణికులకు సాయి ధర్మనం మరింత వేగంగా కానుంది.

ఇప్పటి వరకు కేవలం రైలు, రోడ్డు మార్గాల ద్వారా మాత్రమే భక్తులు షిరిడీకి చేరుకుంటున్న తరుణంలో.. ఇక వచ్చే నెల నుంచి వాయుమార్గం కూడా అందుబాటులోకి రానుంది. దీంతో ఇక భక్తులు ఎంత కాలంగానో ఎదురుచూస్తున్న మార్గం కూడా అందుబాటోలకి రావడంతో ఇకపై షిరిడీకి కూడా భక్తుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఈ విమానాశ్రయాన్ిన మహారష్ట్రా ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కంపెనీ లిమిటెడ్ ఎంఏడీసీ నిర్వహించనుంది.

రైలు రోడ్డు మార్గాల ద్వారా అత్యధిక సమయం ప్రయాణాల కోసమే వినియోగిస్తున్న భక్తులు ఇందులో కొంద ఇబ్బందులను కూడా ఎదుర్కోంటున్నారు. అయితే ఇక వాయుమార్గం కూడా అందుబాటులోకి రావడంతో ఇక రివ్వును ఎగురూకుంటూ సాయి సన్నిధికి చేరుకోనున్న భక్తులు మళ్లీ అదే వాయువేగంతో తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కేవంల దేశీమ విమానాలను మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలను సాగించనున్నాయి. భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాలు కూడా నడిపే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మాత్రం కేవలం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ విమానాశ్రయాలకు మాత్రమే సర్వీసులు నడవనున్నాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shirdi airport  Shiridi Sai  Sai devotees  Ahmednagar  domestic flights  saibaba airport  

Other Articles

Today on Telugu Wishesh