ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమైన ప్రేమ..? కఠోర వాస్తవాలు Love kills more than terror attacks in India, reveal statisticshttp://www.teluguwishesh.com/administrator/index.php?option=com_k2&view=item#

Love kills more than terror attacks in india reveal statistics

love, murder, suicide, terror, honour killing, Andhra Pradesh, Uttar Pradesh, Maharashtra, Tamil Nadu, Madhya Pradesh, India, Terror

According to Government reports, love alone has killed more number of people than any terror attack, between 2001-15.

ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమైన ప్రేమ..? కఠోర వాస్తవాలు

Posted: 04/02/2017 01:49 PM IST
Love kills more than terror attacks in india reveal statistics

ప్రేమకు రెండు మనస్సులను దగ్గర చేయడంతో పాటు రెండు జీవితాలను ఒక్కటి చేసి.. వారిని బతికించే ధైర్యం ఇస్తుందని పెద్దలంటారు. కానీ దేశంలో ఉగ్రవాదం కారణంగా బలవుతున్నవారికంటే ప్రేమ వల్ల అసువులు బాస్తున్న వారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువని విస్తుగొలిపే విషయాలను తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2001-2015 మధ్య గణాంకాలను విశ్లేషించినప్పుడు ఈ కఠోర వాస్తవం బయపడింది. ఈ మధ్యకాలంలో దేశంలో 38,585 హత్యలు, ద్వేషపూరిత హత్యల కేసులు నమోదయ్యాయి. అలాగే 79,189 ఆత్మహత్యలు, 2.6 లక్షల కిడ్నాపులు నమోదయ్యాయి. పెళ్లే లక్ష్యంగా ఈ కిడ్నాపులు జరగడం గమనార్హం.

వీటిలో సగటున ఏడు హత్య కేసులు, 14 ఆత్మహత్యలు, 47 కిడ్నాపులకు ప్రధాన కారణం ప్రేమ. ఇక ఇదే కాలంలో ఉగ్రవాదం కారణంగా 20 వేలమంది మరణించారు. వీరిలో సామాన్య పౌరులు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఇక ప్రేమ కారణంగా ఎక్కువమంది హత్యకు గురవుతున్న వారిలో ఉమ్మడిగా వున్న తెలుగురాష్ట్రం కూడా వుందన్న విషయం అందోళన కలిగిస్తుంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ సహా) నిలిచింది. 2001-15 మధ్య కాలంలో పైన చెప్పుకున్న రాష్ట్రాల్లో 3 వేల కేసులు నమోదయ్యాయి. ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం కేసులకు ఏదో రకంగా ప్రేమతో లింకులు ఉండడం గమనార్హం.

ఇక  ప్రేమ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారు పశ్చిమబెంగాల్‌లోనే ఎక్కువ. అక్కడ 14 ఏళ్ల కాలంలో (2012 గణాంకాలు లభ్యం కాలేదు) ఏకంగా 15 వేల మంది ప్రేమ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 9,405 ఆత్మహత్యలతో తమిళనాడు ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా అస్సాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. ఆయా రాష్ట్రాల్లో 5 వేల మంది చొప్పున ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారితో పోలిస్తే ప్రేమ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య ఆరు రెట్లు అధికమని గణాంకాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : love  murder  suicide  terror  honour killing  Andhra Pradesh  Uttar Pradesh  Maharashtra  Tamil Nadu  Madhya Pradesh  India  Terror  

Other Articles