అగ్రిగోల్డ్ బాధితులకు పవనే చెప్పెను నేనున్నానని..! pawan kalyan questions government over justice for agrigold victims

Pawan kalyan questions government over justice for agrigold victims

Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan AgriGold Scam, Pawan Kalyan AgriGold Scam Victims, AgriGold Scam Janasena, AgriGold Scam Chandrababu Naidu, AgriGold Scam Pawan kalyan, Pawan Kalyan Chandrababu Naidu AgriGold Scam, AgriGold Scam AP Ministers, AgriGold Scam Victims, Pawan kalyan AgriGold Scam Victims, AgriGold Scam Victims Chandrababu Nadiu, AgriGold Victims Pawan Kalyan

pawan kalyan questions government over justice for agrigold victims, asks why there is delay in solving victims demands, when the accused firm has 14 thousand acres of land in andhra pradesh

ITEMVIDEOS: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంపై అలక్ష్యం: పవన్ కల్యాణ్

Posted: 03/30/2017 12:00 PM IST
Pawan kalyan questions government over justice for agrigold victims

అగ్రిగోల్డ్ సమస్య.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఒకటి కాదు రెండు కాదు ఏళ్లుగా నానుతున్న సమస్య. అధిక వడ్డీ ఆశ చూపి బాధితుల నుంచి లక్షలాధి రూపాయలను సేకరించిన అగ్రిగోల్ట్ సంస్థ.. విషయంలో సంస్థ సభ్యులను డైరెక్టరల్ లను అరెస్టు చేసి.. జైల్లో పెట్టి కూడా ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా ఈ విషయంలో బాధితులకు న్యాయం జరగడం లేదు.. ఎందుకు..? ఎవరీదీ అలక్ష్యం.. ఎందుకీ నిర్లక్ష్యం ప్రజల సమస్యలను పరిస్కారిస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ విషయంలో ఎందుకీ నాన్చివేత ధోరణిని అవలంభిస్తున్నాయి..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులతో ఆయన ముఖాముఖి నిర్వహించేందుకు రావడంతో బాధితులతో పాటు అయన అభిమానులు పవన్ కు ఘనస్వాగతం పలికారు. స్థానిక విజయవాడ గేట్ వే హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులెవ్వరూ అత్మహత్యలు చేసుకోవద్దని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పారు. సమస్యను పరిష్కరించే దిశగానే తాను ఇక్కడికి వచ్చాననన్నారు. అగ్రిగోల్డ్ సమస్య ఓ చిక్కుముడిని తలపిస్తుందని అన్నారు. బాధితులకు న్యాయం జరగాలని.. ఈ విషయంలో తాను పోరాటానికి సైతం సిద్దమని ప్రకటించారు.

సమస్యను పరిష్కారం కోసం డెడ్ లైన్లను విధించడం సమంజసం కాదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే అనేక ఏళ్లుగా అపరిష్కారంగా వున్న ఈ సమస్యతో బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి సత్వర న్యాయం జరగాలని అకాంక్షించారు. గతంలో సహారా భూకుంభకోణాలు, శారదా, సత్యం కుంభకోణాల్లో బాధితులకు న్యాయస్థానాలు చేసిన తీర్పులను పరిగణలోకి తీసుకుని బాధితులకు న్యాయం చేయాలన్నారు. దాదాపుగా 14 వేల ఎకరాల భూములు ఆంధ్రప్రదేశ్ లోనే సంస్థ అస్తులన్నా.. వారికి న్యాయం జరగడంలో ఎందుకు జాప్యం జరుగుతుందని పవన్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janasena  pawan kalyan  agrigold scam  ap governments  TDP  vijayawada  

Other Articles