ఫేక్ కిడ్నాప్ డ్రామా.. హెల్ప్ కోరాడు.. సుష్మా ఏం చేసిందంటే... | Sushma Helps Abducted Man in Serbia.

Sushma swaraj comes to aid of kidnapped indian

Sushma Swaraj, Sushma Swaraj Serbia, Fake Kidnap Sushma Help, Sushma Swaraj Help, Serbia Indian Help, Union Minster Sushma Swaraj, Sushma Reacts Fake Kidnap, Sushma Twitter Help

Foreign Minister Sushma Swaraj comes to aid of ‘kidnapped’ Indian in Serbia, finds it was staged.

ఫేక్ కిడ్నాప్ కోసం చిన్నమ్మ సాయం!

Posted: 03/25/2017 01:04 PM IST
Sushma swaraj comes to aid of kidnapped indian

కేవలం ట్వీట్లతోనే ఆపదలో ఉన్న వారిని తక్షణం ఆదుకునే భారత విదేశాంగ మంత్రి సుష్మాస్మరాజ్ మరోసారి వార్తల్లో నిలిచింది. సెర్బియాలో ఆపదలో ఉన్న ఓ ఇండియన్ కు సాయం చేసి ఇండియాకు రప్పించే యత్నం చేస్తోంది. అయితే ఈసారి ఓ వ్యక్తి డ్రామా చేసినా కూడా పెద్ద మనసుతో స్పందించి అతనికి సాయం చేసేందుకు ముందుకు రావటం విశేషం.

రాజీవ్‌ శర్మ అనే వ్యక్తి సెర్బియా లో ఉన్న తన సోదరుడు వినయ్‌ మహజన్‌ ఆపదలో ఉన్నట్లు సుష్మాకు ఓ ట్వీట్ వేశాడు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారని చెబుతూ అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్టు చేశాడు. చొక్కా లేకుండా ఉన్న ఓ వ్యక్తిని కట్టేసి కొడుతున్నట్లుగా ఉంది. ఆ ట్వీట్ కు ఫాస్ట్ గా రియాక్ట్ అయిన చిన్నమ్మ సెర్బియాలోని ఇండియన్ ఎంబసీకి పంపించి ఆదుకోవాలని కోరింది.

రంగంలోకి దిగిన అధికారులు అతన్ని సురక్షితంగా రక్షించగలిగారు. అయితే అదంతా ఫేక్ డ్రామా అని ఆపై అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఏజెంట్ మోసం చేయటం, పైగా డబ్బు లేకపోవటంతో ఇండియాకు రావటానికి ఇలా డ్రామా ఆడాడన్న మాట. దీంతో అసలు విషయం అర్థమైన సుష్మా మరో ట్వీట్ వేసింది. ‘రాజీవ్‌! నీ సోదరుడు అధికారుల సమక్షంలో క్షేమంగానే ఉన్నాడు. మరో విషయమేంటంటే, అతన్ని ఎవరూ కిడ్నాప్‌ చేయలేదు. నువ్వు పంపిన వీడియో నకిలీది. మీ తమ్ముడే కిడ్నాప్‌ అయినట్లు డ్రామా ఆడాడు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా సెర్బియాలో ఉన్న భారత దౌత్యాధికారులతో మాట్లాడాను. మీ తమ్ముడిని మార్చి 25న భారత్‌కు పంపిస్తామని చెప్పారు’ అని ట్వీట్‌ చేసింది.

అంతేకాదు అక్కడ ఇబ్బందులు పడుతున్న మరో 500 మంది భారతీయుల విషయంపై కూడా తాను ఎంబసీ తో మాట్లాడినట్లు తెలిపింది. అయితే సుష్మా మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఇలాంటి ఫేక్ వ్యవహారాలతో విసిగించొద్దంటూ పలువురు కామెంట్లు పెడితే, ఆపదలో ఉన్నవారిని కాపాడటం మంత్రిగా తన బాధ్యత అంటూ మరో సమాధానం ఇచ్చింది సుష్మా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Foreign Minister Sushma Swaraj  Fake Kidnap Drama  Serbia  

Other Articles

Today on Telugu Wishesh