జైలులో శశికళ వాటినే ఎందుకు చదువుతున్నారు..? jailed Sasikala is reading the recieved hate mails

Hate mails received by jailed sasikala claim she murdered jayalalithaa

sasikala receives letters accusing her of murdering Jayalalithaa, hate mails accusing Sasikala of murdering Jayalalithaa, sasikala accused of murdering jayalalithaa, hate mails accusing Sasikala of killing Amma, hate mails for Sasikala at Parappana Agrahara central prison, angry writers curse Sasikala for murdering Jayalalithaa, Parappana Agrahara Central Prison, Sasikala Natarajan, Sasikala DA case verdict, Sasikala jailed, sasikala receives abusive letters

AIADMK leader V K Sasikala, who is serving jail term after her conviction in the disproportionate assets case has received over hundred hate mails accusing her of killing former and late chief minister J Jayalalithaa.

జైలులో శశికళ ఏం చదువుతున్నారో తెలుసా..!

Posted: 03/23/2017 01:46 PM IST
Hate mails received by jailed sasikala claim she murdered jayalalithaa

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్థుల కేసులో అమె నిచ్చెలి చిన్నమ్మ శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తూ ఏం చదవుతున్నారో తెలుసా.? అమ్మ మరణం తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైన శశికళ తనకు వచ్చిన మెయిళ్లతో పాటు ఉత్తరాలు చదువుతున్నారట. అయితే శశికళ పేరున వచ్చిన లేఖలు అమెను ఓదార్చడానికో లేక ధైర్యం చెప్పడానికో అభిమానుల నుంచి వెల్లువెత్తనవి కాదట. మరెవరు రాసారు..? అయితే వాటిని శశికళ ఎందుకు చదువుతున్నారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి కదూ.

అయితే లేఖలన్నీ తన పేరునే రావడంతో అమెకు తప్పలేదు. ఇంతకీ ఆ మెయిళ్లలో ఏముంది..? అంటే.. ఆమెకు ఫుల్ గా శాపనార్థలు పెడుతూ జయలలిత అభిమానులు ఈ ఉత్తరాలను రాస్తున్నారట. అమ్మ మరణానికి కారణమైన శశికళ నాశనం కావాలి అంటూ అమెకే ఈ ఉత్తరాలను పంపుతున్నారంటే ఇది నిజంగా విచిత్రమే. అయితే ఇలాంటి ఉత్తరాలు, మెయిళ్లు ఇప్పటి వరకు వందకు పైగా వచ్చాయని, ఇక మరికొన్ని ఉత్తరాలలో అమ్మ అభిమానులు చిన్నమ్మను అమ్మను హత్య చేసిన హంతకురాలి, అసభ్యపదజాలాన్ని కూడా వాడారని జైలు వర్గాలు సమాచారం.

అమ్మ అకస్మిక మరణానాకి శశికళే కారణమని, అమె నయవంచకురాలని, అమ్మకు అస్పత్రి పాలు కావడం ఇక బయట ప్రపంచాన్ని చూడకుండానే అమె చనిపోవడం అంతాకూడా శశికల కుట్రలో భాగమేనని అభిమానులు తిట్లదండకాన్ని మెయిళ్లలో రాశారట. ఈ లేఖలన్నింటిని ముందుగా ఇలవరసి చదివి వాటిలో మరీ అభ్యంతరకరమైనవి, అసభ్య పదజాలమున్న వాటిని శశికళకు ఇవ్వకుండా మిగతా వాటిని మాత్రమే ఇచ్చేదని జైలు అధికారులు తెలిపారు. శశికళ, సెంట్రల్ జైల్, పరప్పణ అగ్రహార, బెంగళూరు - 560100 అడ్రస్ కు ఈ లేఖలు వచ్చాయని చెప్పారు.

కాగా ఈ లేఖలు తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా దిండిగల్, కరూర్, తిరుచిరాపల్లి, మధురై, ధర్మపురి, సేలం, చెన్నైల నుంచి వచ్చినట్లు పేర్కోన్నారు. మొదట్లో అన్ని ఉత్తరాలను శశికళే చదివేవారని. కాగా అ తరువాత ఇళవరసి ముందుగా చదివి ఆ తరువాత శశికళకు వాటిని ఇస్తున్నారని తెలిపారు. అయితే వందకు పైగా ఉత్తరాలు వచ్చినా.. వాటిలో శశికళను ఓదార్చుతున్న లేఖలు, అమెకు ధైర్యం చెబుతున్న మెయిళ్లు మాత్రం లేకపోవడంతో ఇక అమె గతకొద్ది రోజులుగా వాటిని చదవడం మానేశారట. నిజం చెబితే ఎవరైనా నిష్టూరం కావాల్సిందేగా మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sasikala  jayalalithaa  hate mails  Parappana Agrahara Central Prison  aiadmk  abusive letters  

Other Articles

Today on Telugu Wishesh