మాక్జిన్ వాటర్స్ కు సంచలన ట్విట్లు వెనుక కారణమిదేనా..? Trump aides ‘coordinated with Russia to damage Clinton campaign’

Fbi has information suggesting trump aides coordinated with russia to damage clinton campaign

Donald Trump, impeachment, maxine waters, president, democratic leader, Republican, Hillary clinton, us politics

The FBI has reportedly obtained information suggesting that aides of President Donald Trump communicated with suspected Russian operatives to coordinate the release of information to damage Hillary Clinton’s campaign.

ట్రంప్ కు వ్యతిరేకంగా కీలకాధారలు.. రష్యాతో కలసి కుమ్మక్కు

Posted: 03/23/2017 12:33 PM IST
Fbi has information suggesting trump aides coordinated with russia to damage clinton campaign

అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలలో ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నో వ్యూహాలను ప్రతివ్యూహాలను సిద్దం చేయడం సర్వసాధరణం. అయితే చేయకూడని పనులు చేసి.. అందునా అగ్రరాజ్యానికి అసలు పడిన రష్యా సాయం తీసుకుని మరీ తన ప్రత్యర్థిని ఓడించేందుకు కుట్రలు పన్నారన్న అరోపణలను రిపబ్లికన్ అభ్యర్థిగా బిరిలో వున్నప్పటి నుంచి అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎదుర్కోంటున్నారు. అయితే ఇన్నాళ్లు డెమొక్రటిక్ అబ్యర్థి హిల్లరీ క్లింటన్ ను బలపరుస్తున్న అమె మద్దతుదారులు ఏకంగా అభిశంసనకు సిద్దంగా వుండాలని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు.

అయితే అధ్యక్షులుగా ఎన్నికైన వ్యక్తిపై ఏకంగా హెచ్చరికలు జారీ చేస్తూ ట్విట్ చేయడం వెనుక కారణాలు ఏమైవుంటాయని అమెరికన్లు అలోచిస్తున్న తరుణంలో ఎఫ్ బి ఐ డోనాల్ట్ ట్రంప్ కు వ్యతిరేకంగా కీలక అధారాలను సేకరించినట్లు సమాచారం. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ట్రంప్ వర్గానికి చెందిన పలువురు ప్రచారకర్తలు రష్యాతో కుమ్మకయ్యారని ధృవీకరించారు. ట్రంప్ వర్గానికి చెందిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ వర్గాలు, ట్రావెల్, బిజినెస్, ఫోన్ రికార్డులతో పాటు వ్యక్తిగతంగా పలు పర్యాయాలు వారిని కలసిన అంశాలను.. ఎవరెవరు ఎప్పుడెప్పుడు కలిశారన్న అంశాలను కూడా ఎఫ్ బి ఐ అధికారులు పరిశీలిస్తున్నారు.

కాగా, ఈ మొత్తం ఇంకా ఓ కొల్కిక్కి రాలేదని, అంతా కొలిక్కి వచ్చిన తరువాత కానీ తాము చర్యలకు ఉపక్రమించబోమని ఎఫ్ బిఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ తెలిపారు. అయితే ట్రంప్ కాంఫెయిన్ యాక్టివీటీస్ పై తమ ఏజెంట్లు దృష్టిసారించారని అయన ప్రకటించారు. ఎన్నికలలో ట్రంప్ గెలిపోందేందుకు పలు తప్పుడు మార్గాలను ఎంచుకున్నారని తమ వద్ద అధారాలు వున్నాయని అన్నారు. మరీ ముఖ్యంగా ఒక అమెరికన్ మరో విదేశీ శక్తికి ఏజెంట్ గా పనిచేస్తున్నారన్న విషయమై తాము విచారణ చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో ట్రంప్ వర్గానికి చెందిన మైఖేల్ ఫ్లయిన్, పౌల్ మనాఫోర్ట్, రోజర్ స్టోన్, కార్టర్ పేజ్ తదితరులపై దర్యాప్త కొనసాగుతుందన్నట్లు సమాచారం.

ట్రంప్ ఎక్కువ కాలం శ్వేతసౌదంలో కొనసాగరని, త్వరలోనే అయన అభిశంసనకు గురవుతారని, అందుకు ఆయన సిద్దంగా వుండాలని పేర్కొంటూ ట్విట్ చేయడం వెనుక కూడా ఇదే కారణం కావచ్చునని తెలుస్తుంది. అయితే అమె ట్విట్ కు కారణం మాత్రం గోప్యంగా వున్న సమాచారం లీక్ కావడమేనని తెలుస్తుంది. గతంలోనే అమె ట్రంప్ కు వ్యతిరేకంగా అనేక ట్విట్ లు చేసినా.. ఇంత ఘాటుగా, నేరుగా హెచ్చరిస్తూ చేసిన ట్విట్ మాత్రం ఇదే కావడం గమనార్హం. ఇక ఈ ట్విట్ కూడా నెట్టింట్లో తీవ్ర సంచలనంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles