చౌకధరలో హైదరాబాద్ టు గోవా.. ఎగిరిపోతే ఎంతబాగుంటుంది..! AirAsia India Offers Tickets From Rs. 899 Under Big Sale

Airasia india offers tickets from rs 899 under big sale

AirAsia, Offers Tickets, Rs. 899, Big Sale, AirAsia Big Sale, AirAsia India Big Sale, AirAsia India offer, AirAsia Rs 899, AirAsia India Rs 899 ticket, AirAsia Big Sale scheme

Priced at Rs. 899, the lowest all-inclusive ticket under the scheme is being offered on AirAsia India's Bengaluru-Hyderabad route.

చౌకధరలో హైదరాబాద్ టు గోవా.. ఎగిరిపోతే ఎంతబాగుంటుంది..!

Posted: 03/16/2017 07:47 PM IST
Airasia india offers tickets from rs 899 under big sale

విమానయానం.. ఒకనాడు సామాన్యుల కల. కానీ ఇప్పుడు విమానయాన రంగంలో నెకొన్న చౌకధర యుద్దం నేపథ్యంలో ఉన్నత మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సీటు అక్యూపెన్సీ కెపాసిటీని పెంచుకునేందుకు తద్వారా నష్టాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రైవేటు రంగంలోని విమానయాన సంస్థలు చౌకధర యుద్దాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ.. కొత్తగా విమానయానం చేయాలని భావించే ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ విమాన యాన సంస్థ ఎయిర్‌ ఆసియా  ఇండియా విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  

దేశీయ, అంతర్జాతీయంగా ప్రాంతాలకు దేశీయ కస్టమర్లతో పాటు విదేశీ పర్యాటకులను కూడా అత్యంత చౌకధరల్లో చే్ర్చుతున్న ఎయిర్ ఏషియా.. తాజాగా మరో తగ్గింపు ధరల ప్రయాణాన్ని కస్టమర్లకు అందించింది. ఎయిర్ ఏషియా ‘బిగ్‌ సేల్‌’ పథకం కింద అన్ని ఖర్చులు కలుపుకొని రూ. 899నుంచి ప్రారంభమయ్యే డిస్కౌంట్‌ ధరలను ప్రకటించింది. దేశీయ రూట్లలో  ఈరేట్లను అమలు చేయనుంది. మార్చి 19 లోపు  బుక్‌ చేసుకున్న ఈ టికెట్ల ద్వారా సెప్టెంబర్‌ 1, 2017 నుంచి జూన్‌ 5, 2018 మధ్య ప్రయాణించే వెలుసులు బాటు కల్పించింది.

ఎయిర్‌ ఏసియా వెబ్‌సైట్‌ ప్రకారం  బెంగళూరు-​హైదరాబాద్‌ మధ్య అతి తక్కువ ధర రూ. 899గా ఉండనుంది.  బెంగళూరు, కొచీ, గోవా, పూనే, న్యూ ఢిల్లీ, గౌహతి వైజాగ్, హైదరాబాద్, శ్రీనగర్ వంటి దేశీయ గమ్యస్థానాలకు ఈ తగ్గింపు ధరలు అమలవుతాయి. తక్కువ ధరల్లో హైదరాబాద్‌ నుంచి గోవా ఎగిరిపొమ్మని...సర్ఫింగ్‌,  డైవింగ్‌, స్నోర్కలింగ్‌ను ఎంజాయ్‌ చేయమంటూ  ట్విట్టర్‌ ద్వారా ఒక  ప్రకటన జారీ చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  Offers Tickets  Rs. 899  Big Sale  AirAsia Big Sale  

Other Articles