సుకుమా జిల్లాలో మళ్లీ పంజా విసిరిన మావోలు.. Suspected Maoist rebels kill 11 police in Chhattisgarh

Maoist rebels kill 11 policemen in east indian state of chhattisgarh

Maoist attack in Chhattisgarh, Chhattisgarh, Bastar, Rajnath Singh, Raipur, Narendra Modi, Maoists, CRPF, maoists attack, setback for crpf, chhattisgarh, sukma district

After a brief lull, Maoists struck again in Bastar, killing 12 CRPF personnel and injuring two in strife-torn Sukma district of Chhattisgarh

సుకుమా జిల్లాలో మళ్లీ పంజా విసిరిన మావోలు.. 12 మంది పోలీసులు మృతి

Posted: 03/11/2017 02:32 PM IST
Maoist rebels kill 11 policemen in east indian state of chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ విరుచుకుపడ్డారు. సుకుమా జిల్లా బెజ్జి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దాంతో సీఆర్పీఎఫ్ 219 బెటాలియన్‌కు చెందిన 12 మంది జవాన్లు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సంఘటన స్థలంలోనే 11 మంది మరణించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో జవాను ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు.

ఐఈడీ అమర్చి, దాన్ని పేల్చడంతో పాటు ఆ షాక్‌లో ఉన్న జవాన్లను చుట్టుముట్టి కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ మరిన్ని ఐఈడీలను అమర్చారని అంటున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు.. ఒక్కసారిగా విరుచుకుపడి జవాన్లను హతమార్చారు. కూంబింగ్ చేస్తున్న సీఆర్పీఎఫ్‌ బలగాల మీదకు కాల్పులు జరిపారు. దాంతో 12 మంది మరణించారు. ఈ కాల్పుల్లో కొందరు మావోయిస్టులు కూడా మరణించినట్లు అనుమానిస్తున్నారు.

ఇంతకుముందు ఫిబ్రవరి మొదటివారంలో ఛత్తీస్‌గఢ్‌లోనే నారాయణపూర్ జిల్లాలోని అకాబీడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. అది మావోయిస్టులకు పెద్ద దెబ్బగా అప్పట్లో భావించారు. నిజానికి అప్పటినుంచి ప్రతీకారం తీర్చుకోడానికి ఎదురుచూస్తున్న మావోయిస్టులు.. తాజాగా సుకుమా జిల్లాలో విరుచుకుపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles