‘‘ఏనీ టైం నో మనీ’’ అంటూ వెక్కిరిస్తున్న ‘నో క్యాస్ బోర్డులు’ 'No Cash' boards on ATMs in Telugu States

People facing problems with no cash boards near atms

demonetisation, no deposits, people problems, rbi on currency ban, recalibrated atms, currency in circulation, gujarat singer, cash rain in gujarat, PM modi, Arun jaitley, RBI, urjit patel

telugu states people are experiencing the impact of demonetistion once again as they are face currency problems with atm centers welcome them with no cash boards

‘‘ఏనీ టైం నో మనీ’’ అంటూ వెక్కిరిస్తున్న ‘నో క్యాష్ బోర్డులు’

Posted: 03/10/2017 09:47 AM IST
People facing problems with no cash boards near atms

పెద్దనోట్ల రద్దు తర్వాత జనవరి నుంచి క్రమంగా తగ్గిన కష్టాలు మళ్లీ మార్చి మొదటి వారంలో మొదలయ్యాయి. కరెన్సీ కష్టాలు ప్రజలను మళ్లీ పట్టిపీడిస్తున్నాయి. నగదు లేక ఏటీఎంలు వట్టిపోతున్నాయి. నగరంలోని ఏటీయంల వెతుకుతూ.. వాటి కోసం జనాలు పరుగులు పెట్టాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. బలవంతంగా దేశ ప్రజలను కేంద్ర డిజిటల్ ట్రాన్స్ యాక్షన్స్ వైపు నడిపస్తుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.  ఏ ఏటీయం చూసినా ఏమున్నది గర్వకారణం.. వక్కిరిస్తూ దర్శనమిచ్చే నో క్యాష్‌ బోర్డులు తప్ప అంటూ ప్రజలు సైటర్లు వేసుకునే దుస్థితి ఏర్పడింది. ఫలానా ఏటీయంలో డబ్బులు వున్నాయని తెలియగానే ప్రజలు వాటి దెగ్గర వాలిపోతూ.. నోట్ల రద్దు నాటి క్యూలను మరోసారి కడుతున్నారు.

ఇలా ఓ 30కిపైగా ఏటీఎంలు తిరిగితే తప్ప.. ఓ రూ.2వేలు దొరకని పరిస్థితి దాపురించింది.  గురువారం నగరంలోని 90 శాతం ఏటీఎంల వద్ద ‘నో క్యాష్‌’, ‘నాట్‌ వర్కింగ్‌’ అనే బోర్డులు వెలిశాయి. దీంతో ఖాతాదారులంతా హోం బ్రాంచీలకు పరుగులు పెట్టారు. అక్కడా అనుకున్నంత స్థాయిలో నగదు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రూ.10 వేలు డ్రా చేయాలనుకున్న ఖాతాదారులకు రూ.5వేలతో సరిపెడుతున్నారు. మరోవైపు చెస్ట్‌ నుంచి కోరినంత నగదు బ్యాంకులకు చేరడం లేదని బ్యాంకు అధికారులు అంటున్నారు. ఆర్బీఐ నుంచి నగదు రావడం తగ్గిపోయిందని, అందుకే ఏటీఎంలలో నగదు పెట్టడం కష్టంగా మారిందని ఏజెన్సీలు చెబుతున్నాయి.

అయితే ఇందుకు బ్యాంకుల తాజాగా విధించిన అంక్షలు, మార్చిన నిబంధనలే కారణమంటున్నారు పలువురు ఖాతాదారులు. డబ్బు లావాదేవీల కోసం బ్యాంకులు వద్దకు, ఏటీమం వద్దకు వెళ్లవద్దని, అయినా నెలకు నాలుగు పర్యాయాలు కన్నా అధికంగా ఏం లావాదేవీలు జరుపుతారని ఎస్బీఐ చైర్మనే్ అరుంధతీ బట్టాచార్య లాంటి అధికారులు ప్రజలను నిలదీస్తుంటే.. వ్యాపారులు డబ్బును బ్లాక్ చేస్తున్నారని, దీంతో తమలాంటి సామాన్య మధ్యతరగతి ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పడం లేదని ఖాతాదారులు నిట్టూర్చుతున్నారు.

ఈ పరిస్థితులకు 2వేల నోట్లు పెద్ద ఎత్తున బ్లాక్‌ కావడమే కారణమని అధికారులు అంటున్నారు. పెద్దనోట్లను కేంద్రం రద్దుచేసిన సమయంలో దేశంలో ఆ నోట్ల విలువ రూ.15లక్షల 40వేల కోట్లు. డిసెంబరు 31 నాటికి పూర్తిస్థాయిలో పెద్దనోట్లు బ్యాంకులకు చేరాయి. అయితే రద్దయిన పెద్దనోట్లు స్థానంలో ఆర్బీఐ అందుబాటులో తీసుకువచ్చిన కొత్తనోట్లు సుమారు రూ. 9 లక్షల కోట్లు మాత్రమేనని, సుమారు రూ. 6.4 లక్షల కోట్ల విలువైన నోట్లను తిరిగి మార్కెట్లోకి తీసుకురాలేదని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.

పెద్దనోట్లు రద్దు ప్రకటన తర్వాత తెలుగు రాషా్ట్రలకు రూ.50 వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు వచ్చాయని బ్యాంకర్ల అసోషియేషన్లు తెలిపాయి. వీటిలో క్రమంగా రెండునెలల్లో రూ.40 వేల కోట్లు బ్లాక్‌ అయిందని, దీంతో సమస్యలు తలెత్తుతున్నాయని బ్యాంక్‌ అసోషియేషన్‌ నాయకులు అంటున్నారు. కాగా నగదు చలామణి తగ్గితే.. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు క్యాష్‌లెస్‌ లావాదేవీలకు మొగ్గుచూపుతారని ఆర్బీఐ, ప్రభుత్వం భావిస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh