అది ఉగ్రదాడేనా..? ఇంకా తేల్చని పోలీసులు Two killed in shooting at Basel cafe, one badly injured

Two killed one seriously injured at basel cafe probe underway

basel, cafe 56, shooting, basel, Basel cafe, basel shooting, Cafe 56, Geneva, switzerland, Switzerland Shooting

Two men shot dead two people and seriously injured a third on Thursday at a cafe in Basel, north-west Switzerland, police said as they hunt for the suspects.

అది ఉగ్రదాడేనా..? ఇంకా తేల్చని పోలీసులు.. అందోళన రేపుతున్న గన్ కల్చర్

Posted: 03/10/2017 11:49 AM IST
Two killed one seriously injured at basel cafe probe underway

స్విట్జర్లాండ్‌లోని ఓ కేఫ్లో కాల్పులు కలకలం రేపాయి. స్విట్జర్లాండ్ లోని బాసిల్ పట్టణంలో గల కేప్ 56లోకి.. ఇద్దరు ప్రవేశిస్తూనే దుండగులు అక్కడివారిపై కాల్పులతో విరుచుకుపడ్డారు. తుపాకులతో విచక్షణారహితంగ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డిన వారిని స్థానిక అస్పత్రికి తరలించిన పోలీసులు వారికి చికిత్సనందిస్తున్నారు.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాసిల్‌ పట్టణంలోని 'కేఫ్‌ 56'లోకి రాత్రి 8:15 గంటల సమయంలో ప్రవేశించిన ఇద్దరు దుండగులు వస్తూనే కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. కాల్పుల అనంతరం వారు రైల్వేస్టేషన్ వైపు పారిపోయారని తెలిపారు. అయితే.. ఈ దాడి వెనుకాల ఉగ్రకుట్ర ఉందా అనే విషయాన్ని మాత్రం పోలీసులు నిర్థారించలేదు. కాల్పులకు గల కారణాలు కూడా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని బాసెల్‌ ప్రాసిక్యూటర్స్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

దేశంలోనే అత్యధికంగా ఆయుధాలు కలిగిన స్విస్ ప్రజల్లో తాజాగా చవిచూస్తున్న గన్ కల్చర్ భయాందోళన రేపుతుంది. దేశంలోని 80 లక్షల మంది జనాభా వుండగా, దాదాపుగా ఇరవై లక్షల మంది ప్రజల వద్ద అయుధఆలు వున్నాయని సమాచారం. అయితే ఆయుధాలు కల్గిన ప్రజలు పెద్ద సంఖ్యలో వున్నా.. ఇలాంటి ఘటనలు మాత్రం ఎప్పుడో కానీ చోలుచేసుకోవని, అయితే తాజాగా జరిగిన కాల్పులు నేపథ్యంలో ఇకపై ఇలాంటి ఘటనలు పునారావృతం అవుతాయన్న భయాందోళన మాత్రం అక్కడి ప్రజల్లో నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : basel  cafe 56  shooting  basel  Basel cafe  basel shooting  Cafe 56  Geneva  switzerland  Switzerland Shooting  

Other Articles

Today on Telugu Wishesh