చేయకూడని పని చేసిన ముంబై మోడల్ కు అరదండాలు.. Mumbai model held for crying 'bomb' just before boarding flight for Delhi

Mumbai model held for crying bomb just before boarding flight for delhi

Kanchan Thakur, Air India flight 101. model held, bomb scare, Air India (AI), Kanchan Thakur, arrest, Central Industrial Security Force, CISF, mumbai model, Bomb hoax, Air India, airport officials, crime

Mumbai woman was arrested after she triggered panic in Sahar airport's T2 by asking security to "check her friend's handbag carefully as it had a bomb inside" and then getting into an argument with CISF officials.

చేయకూడని పని చేసిన ముంబై మోడల్ కు అరదండాలు..

Posted: 03/04/2017 08:54 PM IST
Mumbai model held for crying bomb just before boarding flight for delhi

విమానంలో బాంబు ఉందంటూ నగరానికి చెందిన 27 ఏళ్ల ఓ మోడల్ కలకలం సృష్టించింది. సహార్ ఎయిర్ పోర్టులో టెర్మినల్ 2 వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. తీరా అది ఒట్టిదేనని ఆమె ఒప్పుకున్నప్పటికీ... పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసునమోదు చేశారు. సరిగ్గా రాత్రి 9 గంటలకు విమానం బయల్దేరుతుందనగా.. ముంబై మోడల్ కాంచన్ ఠాగూర్ తన స్నేహితురాలి బ్యాగులో బాంబు ఉందనీ జాగ్రత్తగా తనిఖీ చేయాలని సెక్యురిటీ గార్డులకు చెప్పింది. దీంతో విమానంలో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారులకు చేరవేశారు.

విమానాన్ని ఆపి ఆమెను, ఆమె ముగ్గురు స్నేహితురాళ్లను కిందికి దించేశారు. అయితే బాంబు మాట ఒట్టిదేననీ తాను సరదాగా అలా అన్నాననీ సదరు మోడల్ అధికారులతో వాగ్యుద్ధానికి దిగింది. అయినా గంటసేపటి తనిఖీల తర్వాత కాంచన్, ఆమె మిత్రబృందం లేకుండానే ఢిల్లీ విమానాన్ని పంపించేశారు. ఈ సందర్భంగా ఆమె అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.. ‘‘నిజంగా ఉగ్రవాదులు విమానం ఎక్కినా పట్టుకోలేరు... కానీ జోక్ చేసినందుకు మాత్రం ఇంతలా చేస్తారా’’  అంటూ విరుచుకుపడింది.

అయితే పుకార్లు సృష్టించి ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన వీరికి బుద్ధి చెప్పకుండా వదిలేది లేదని అధికారులు పేర్కొన్నారు. కాంచన్‌ను అరెస్టు చేసి ఐపీసీ 505(1)(బి) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష పడేఅవకాశం ఉంది. విచారణ పూర్తయ్యే వరకు ఆమెతో పాటు ఆమె మిత్రులు నగరాన్ని విడిచి వెళ్లరాదని అధికారులు ఆదేశించారు. కాగా మోడల్ స్నిహితురాళ్లలో ఒకామె తల్లికి అనారోగ్యంగా ఉండడంతో మిగతా వారంతా ఆమెకు తోడుగా ఢిల్లీ వెళ్లేందుకు బయల్దేరారు. తీరా కాంచన్ నిర్వాకంతో వారంతా ముంబైకి పరిమితం కావాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanchan Thakur  Air India flight bomb scare  Air India (AI)  model arrest  Bomb hoax  crime  

Other Articles