చెప్పుతో కోడతా, తాట తీస్తా.. బాలకృష్ణ పీఏ balakrishna pa shekar abhusing contractor

Actor balakrishna pa shekar abhusing contractor audio leaked

hindupur, ananthapur, pa shekar, abusing audio, threatens, contractor, bribes, viral video, social media

Actor turned Politician Hindipur MLA Balakrishna personal assistant shekar abusing contractor audio goes viral on social media

ITEMVIDEOS: చెప్పుతో కోడతా, తాట తీస్తా.. బాలకృష్ణ పీఏ

Posted: 02/05/2017 09:25 AM IST
Actor balakrishna pa shekar abhusing contractor audio leaked

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుంది హిందూపురం శాసనసభ్యుడు, సినీ నటుడు బాలకృష్ణ పీఏ శేఖర్ వ్యవహారం. టీడీపీకి అన్నగారి హయాం నుంచి కంచుకోటగా వున్న ఈ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలందరూ దూరమయ్యేలా చేసుకుంటున్నారు శాసనసభ్యడు బాలకృష్ణ, అయితే స్వతహాగా బాలకృష్ణ ఏమీ చేయకపోయినా.. ఆయన పీఏగా చెప్పుకుంటున్న శేఖర్ మాత్రం పార్టీ శ్రేణులు, పరాయివారు, మనవారు అన్న భేధాలు లేకుండా అరాచకాన్ని చూపుతున్నారు.

పార్టీనేతలే అతని అవినీతిపై పెల్లుబిక్కి సమావేశాలు ఏర్పాటు చేసుకుని అతని తొలగించాలని డిమాండ్ చేసే స్థితికి వచ్చారంటే.. పరిస్థితి ఎలా వుందో మనకు ఇట్టే అర్థమౌతుంది. తాజాగా ఇవాళ కూడా హిందూపురానికి చెందిన నేతలు సమావేశమై పీఏ శేఖర్ వ్యవహరమై చర్చించనున్నారు. ఇప్పటికీ మండలాల వారీగా టీడీపీ శ్రేణులు సమావేశాలు ఏర్పాటు చేసి శేఖర్ కు వ్యతిరేకంగా నిరసిస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి విషయం చేరలేదా..? అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

తాము ఎంతగా చెబుతున్నా శేఖర్ నే ఇంకా పీఏగా కొనసాగించడానికి కారణాలు ఏంటో అర్థం కావడం లేదన్న అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ప్రోద్భలంతోనే శేఖర్ రెచ్చిపోతున్నాడన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఏ శేఖర్ కు సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయ్యింది.  కాంట్రాక్టరుకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ చెప్పుతో కొడతా, తాట తీస్తా అంటూ హెచ్చరికలు చేస్తున్నారు.. అడియోను మీరూ వినండి..

బాలకృష్ణ పీఏ శేఖర్‌ ఆడియో సారాంశం..
పీఏ శేఖర్‌: ఏమిటి విశేషాలు?
కాంట్రాక్టర్‌: ఏమీ లేవన్నా. మీరే చెప్పాలన్నా.
పీఏ శేఖర్‌: ఏమీ..?
కాంట్రాక్టర్‌: విశేషాలు ఏమీ లేవన్నా.. మీరే చెప్పాలన్నా.
పీఏ శేఖర్‌: ఏమేమీ..?
కాంట్రాక్టర్‌: పొద్దున మీ దగ్గరికి వచ్చాను. చాలామంది ఉంటే మాట్లాడలేదు. మున్సిపాల్టీలో లెస్‌(తక్కువ ధర)కు టెండర్లు వేశాను.
పీఏ శేఖర్‌: (రాయడానికి వీలు లేని అసభ్య పదజాలం) నిన్నెవడ్రా నా కొడకా హిందూపురంలో టెండర్‌ వేయమన్నది? చెప్పుతో కొడతా నాకొడకా.. హిందూపురంలో కన్పిస్తే తాట తీస్తా నా కొడకా.
కాంట్రాక్టర్‌: అన్నా.. మీతో ఇప్పటికే మాట్లాడాను. బాలాజీ కూడా ఉన్నారు. మీతో మాట్లాడే టెండర్లు వేశా.
పీఏ శేఖర్‌: బాలాజీ ఎవడ్రా నాకొడకా.. వాణ్నీ నిన్నూ ఇద్దర్నీ చెప్పుతో కొడతా. వానితో ఏమాట్లాడినావ్‌ రా నాకొడకా.
కాంట్రాక్టర్‌:అన్నా.. నేను ఏమీ దొంగను కాదు. మేం పనులు చేసుకుంటేనే బతికేది. పూలకుంటలో ఇప్పటికే పనులు చేస్తున్నా. అందుకే టెండర్లు వేశా. తప్పు ఏమీ చేయలేదు.
పీఏ శేఖర్‌: చెప్పుతో కొడతా నాకొడకా.. అనంతపురానికి నా మనుషులను పంపి స్తా. పనులు ఇప్పించరా నాకొడకా.
కాంట్రాక్టర్‌: అన్నా.. నేను కాంట్రాక్టర్‌ను.. ఎక్కడైనా టెండర్లు వేసుకుంటా.. పనులు చేసుకుంటా.
పీఏ శేఖర్‌: చెప్పుతో కొడతా నాకొడకా.. ధైర్యం ఉంటే హిందూపురం రారా నా కొడకా.. నువ్‌ రారా హిందూపురం. (అసభ్య పదజాలం)
కాంట్రాక్టర్‌: అన్నా.. పనులు చేసుకుంటేనే కదా మేం బతికేది.
పీఏ శేఖర్‌: నీకొకడికేనేమిరా తెలివి నా కొడకా.. హిందూపురం రారా నాకొడకా నీ తాట తీస్తా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hindupur  ananthapur  pa shekar  abusing audio  threatens  contractor  bribes  viral video  social media  

Other Articles