సంజు భాయ్ కి మళ్లీ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు Sanjay Dutt robs his neighbours of their sleep yet again

Sanjay dutt robs his neighbours of their sleep yet again

Actor, Celebration, Controversy, Party, Sanjay Dutt, mumbai police, bollywood, entertainment

The Khalanayak actor has set a record of sort by having cops drop by his place twice in less than 20 days recently.

సంజు భాయ్ కి మళ్లీ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

Posted: 02/04/2017 08:09 PM IST
Sanjay dutt robs his neighbours of their sleep yet again

అక్రమంగా ఆయుధాలు కలిగివున్న కేసులో దోషిగా తేలి జైలు జీవితం ముగించుకుని సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన సీనియర్ హీరో సంజయ్ దత్‌కు పోలీసులు ఈమధ్య ఒక వార్నింగ్ ఇచ్చారట. పోలీసులకు.. సంజూబాబాకు మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఉంది. అయితే తాజా వార్నింగ్ మాత్రం పాత కేసులకు సంబంధించినది కాదు. ఆయన ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు వచ్చారు.
 
విషయం ఏమిటంటే.. జనవరి 14వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా సంజయ్ దత్ కుటుంబం వాళ్లు మేడమీదకు చేరుకుని పెద్ద సౌండుతో మ్యూజిక్ పెటప్టారు. దాంతో చుట్టుపక్కల వాళ్లు ఎవరికీ నిద్ర అన్నది లేకుండా పోయింది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్లొచ్చి సంజయ్ దత్‌కు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి మరీ మ్యూజిక్ ఆపించారు. అంతకుముందు సంజయ్ దత్ ఉండే ప్రాంతానికి చెందిన అసోసియేషన్ వాళ్లు కూడా ఈ విషయమై లేఖలు రాసినా ఆయన మాత్రం మారలేదట. ఈ విషయాన్ని జోనల్ డీసీపీ వరకు తీసుకెళ్లి సంజయ్ దత్ మీద గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor  Celebration  Controversy  Party  Sanjay Dutt  mumbai police  bollywood  entertainment  

Other Articles