బాబు సర్కార్ జాబితాలోకి అరుదైన ఘనత.. bugana demands white paper on investments in AP

Bugana demands white paper on investments in ap

ysrcp mla and public accounts committee chairman buggana rajendra prasad says ap government should realease white paper on investors who promised to establish their compamies to ap.

ysrcp mla and public accounts committee chairman buggana rajendra prasad says ap government should realease white paper on investors who promised to establish their compamies to ap.

బాబు సర్కార్ జాబితాలోకి అరుదైన ఘనత’

Posted: 01/30/2017 07:31 PM IST
Bugana demands white paper on investments in ap

నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తే.. ఆంధ్రప్రదేశ్ జాతకం మారుతుందని, పెట్టబడులు వరదలై పారుతాయని రాష్ట్రంలోని అన్ని పార్టీలు గగ్గోలు పెడుతున్నా.. తమకు ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోకి ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చేస్తున్న ప్రచారమంతా వట్టి మాటలేనని, పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ లెక్కలేనని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రెండేళ్లలో రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, ఇవి ఎక్కడ నుంచి వచ్చాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అరుదైన ఘనతను సాధించారని ఎద్దేవా చేశారు, అంకెలతో గారడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. కిరణ్‌ కుమార్ రెడ్డి రికార్డును చంద్రబాబు బ్రేక్ చేశారని ఎద్దేవా చేశారు. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు ఒక రోజులో రూ. 6.50 లక్షల కోట్ల ఎంవోయూలు చేస్తే, చంద్రబాబు ఒక్కరోజులో రూ.10.50 లక్షల కోట్ల ఎంవోయూలు చేశారని తెలిపారు. విద్యుత్ పై ఎంవోయూలు ఎందుకో అర్థం కాదని వాపోయారు. అదనంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను అమ్మకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ‘ఈజ్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్’లో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని చెప్పుకోవడాన్ని రాజేంద్రనాథ్‌ తప్పుబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles