మహిళల నిరసనతో అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అసహనం 'Millions' join anti-Trump women's marches

Women protesters swarm streets across us

Donald Trump, Inauguration, media, protests, US media, president donald trump, Trump accuses media, United States of america, women million marched

Hundreds of thousands of women have filled the streets of major US cities in a wave of mass protests against President Donald Trump the day after his inauguration.

మహిళల నిరసనతో అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అసహనం

Posted: 01/22/2017 12:27 PM IST
Women protesters swarm streets across us

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. గత శుక్రవారం అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అధ్యక్షుడికి వ్యతిరేకంగా అదేరోజు పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసన తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి పది లక్షలకు పైగా మహిళలు తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి తమ అధ్యక్షుడిగా ట్రంప్ వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏ సంఘాలు, సంస్థలతో సంబంధంలేకుండానే మహిళలు తమ వ్యతిరేకతను తెలిపారని అధికారులు చెబుతున్నారు.

తనపై ఈ స్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు. వాషింగ్టన్ లోని సీఐఏ కార్యాలయానికి శనివారం వెళ్లిన ట్రంప్.. తనపై అకారణంగా మీడియా సంస్థలు దుష్రచారం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌లో మాత్రం అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవడంతో మహిళలు ఆందోళన చేపట్టలేకపోయారు. మరోవైపు బోస్టన్, చికాగో, సీటెల్, న్యూయార్క్, లాస్ ఏంజెలిస్ లలో ఒక్కో ప్రాంతంలో లక్షకు పైగా మహిళలు ట్రంప్ తీరుతో నష్టాలే ఎక్కవ అంటూ నినాదాలు చేశారు.

యూ ఆర్ నాట్ అవర్ ప్రెసిడెంట్, వన్ బిల్ స్కిప్ ఔట్ అన్, రోగ్ విన్, ఇలా పలు రకాల ప్లకార్డులను ప్రదర్శించారు. మహిళల నిరసనలో పురుషులు భాగస్వాములైనప్పటికీ వారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. 'మహిళల హక్కులే మానవ హక్కులు' అంటూ పలు ప్రాంతాల్లో నినాదాలు చేశారు. గతంలో ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా ప్రమాణం చేసినప్పుడు కూడా ర్యాలీలు, ఆందోళనలు జరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh