వీడియో: సాహస బాతు.. పులికి చుక్కలు చూపించి... పేకాట ఆడేసుకుంది | World's bravest duck goes for a swim with tiger.

Bravest duck ever plays with tiger for fun

Bravest Duck, Tiger Video, Duck Tiger Video, Tiger Duck, Tiger hunt Duck, bravest duck, Sumatran tiger, Bravest Duck, Duck Plays with Tiger, Tiger Funny Videos, Duck Funny Video

World's bravest duck plays with tiger at Australian zoo. A wild duck plays with a Sumatran tiger for fun at Symbio Wildlife Park.

ITEMVIDEOS:పులితో కయ్యం.. నాకేం భయం

Posted: 01/21/2017 10:01 AM IST
Bravest duck ever plays with tiger for fun

పులి మీద పడితే ఏం చేస్తారు ఎవరైనా? భయంతో వణికి చస్తారు కదా. అది వేటకు దిగిందంటే దాని కంటబడిన దానికి భూమిమీద నూకలు చెల్లినట్టే. మరి అదే పులితో ఆడుకోవాలనుకుంటే మాత్రం... వేటాడేస్తది! అయితే ఇక్కడో చిన్న జీవి మాత్రం పులినే పేకాట ఆడేసుకుంది. చిక్కదు.. దొరకదు... అన్న రీతిలో ముప్పుతిప్పలు పెట్టేసింది. వెంటాడి, వేటాడి అలిసిపోయిన పులి 'ఈ పూటకి ఇక పస్తే' అని భావించి వేట నుంచి విరమించుకుంది.

ఇంతకీ ఘటన ఆస్ట్రేలియాలోని సింబియో వైల్డ్ లైఫ్ పార్క్ లో చోటుచేసుకుంది. నీటి కొలనులో ఓ బాతు తన పని తాను చేసుకుంటోంది. దాహం తీర్చుకునేందుకు ఆ నీటి కొలనును సమీపించిన పులి, బాతును చూసింది. అంతే, వెంటనే వేటాడి తినెయ్యాలని భావించింది. నీటిలో స్వేచ్ఛగా ఈదే బాతును తినాలనుకోవడం ఆ పులికి అత్యాశే అయింది. దీంతో చాలా సేపు దాని వెంటపడ్డ పులి ఇక దానిని పట్టుకోవడం తన వల్ల కాదని భావించి తోకముడిచింది.ఈ సన్నివేశాన్ని ఓ టూరిస్ట్ తన కెమెరాలో బంధించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. తన కాంపౌండ్ లోకి వచ్చిన పులిరాజును ఉరికించి ఉరికించి ఆడుకున్న వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. ఇదంతా చూసిన వారు సైజు తక్కువ కదా అంచనా వేస్తే ఇలాగే ఉంటుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఎంత పెద్ద దారం అయిన చిన్న సూదికి లోకువే కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tiger  Duck  Hunt  Video  

Other Articles

Today on Telugu Wishesh