డబ్బు కోసం బాయ్ ఫ్రెండ్ తో బీటెక్ యువతి ఏం చేసిందంటే... | girl fake kidnap plan with boy friend busted.

Teens enact kidnap drama to extort dad

Hyderabad Kidnap, Fake Kidnap drama, Fake Kidnap Drama, Teens enact kidnap, engineering student fake Kidnap, girl extort dad, Hyderabad teen girl fake kidnap drama

Teens enact kidnap drama to extort dad in Hyderabad. A high-voltage kidnap drama staged by two engineering students left city police on tenterhooks for a few hours on Tuesday. However, police and family members of the `victim' heaved a sigh of relief when the two students were caught at Shahalibanda.

యువతి హైవోల్టేజ్ కిడ్నాప్ డ్రామా, తుస్స్...

Posted: 01/20/2017 09:25 AM IST
Teens enact kidnap drama to extort dad

తమ కూతురికి ఏమైపోతుందోనని కంగారు పడిపోయిన ఆ తల్లిదండ్రులకు చివర్లో షాక్ మాములుగా తగల్లేదు. విలాసాల‌కు అల‌వాటు ప‌డిన యువ‌తి డ‌బ్బుల కోసం కిడ్నాప్ డ్రామా ఆడింది. అందుకు ప్రియుడి సహకారం తీసుకుని పేరెంట్స్ కి ముచ్చెమ‌ట‌లు పోయించింది. హైద‌రాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఫేక్ కిడ్నాప్ ఉదంతం వివరాల్లోకి వెళ్లితే...

బేగంబ‌జారుకు చెందిన సదరు యువ‌తి(19) నగర శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చ‌దువుతోంది. అదే క‌ళాశాల‌లో చ‌దువుతున్న సీనియర్ యువకుడి‌(20)తో ప్రేమ‌లో ప‌డింది. ఇద్ద‌రూ జ‌ల్సాల‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు. యువ‌తికి తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మ‌నీ ఆ యువతికి స‌రిపోక‌పోవ‌డంతో క‌ష్ట‌తరంగా మారింది. ఇదే విష‌యాన్ని ప్రియుడితో చెప్పి ఆవేద‌న చెందేది. బాగా డ‌బ్బు సంపాదించి విదేశాల‌కు వెళ్లాల‌ని ఉంద‌ంటూ తరచూ ప్రియుడితో చెప్పేది. ఎట్టకేలకు వ్యాపారవేత్త అయిన తన తండ్రి వ‌ద్ద చాలా డ‌బ్బు ఉంద‌ని చెప్పి, కిడ్నాప్ డ్రామాకు ఫ్లాన్ వేసింది.

ఇదిలా ఉండగా ఓరోజు యువ‌తి తల్లిదండ్రులకు సదరు ప్రేమికుడు ఫోన్ చేసి కిడ్నాప్ చేశామని, ప్రాణాల‌తో కావాలంటే రూ.30 ల‌క్ష‌లు ఇవ్వాలి' అంటూ హెచ్చ‌రించాడు. దీంతో భ‌య‌ప‌డిన యువ‌తి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా, అసలు గుట్టు ర‌ట్ట‌యింది. ప్రియురాలి స‌ల‌హాతోనే కిడ్నాప్ డ్రామా ఆడిన‌ట్టు యువకుడు పోలీసులకు తెలపగా, యాక్షన్ డ్రామాగా కొనసాగిన సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Fake Kidnap  Student  

Other Articles

Today on Telugu Wishesh