కలిసి డిన్నర్ కూడా చేశాడా? ఎప్పుడు? | Pawan Dinner With Chiru and Family.

Pawan kalyan finally meets chiru

Pawan kalyan, Chiranjeevi, Pawan Chiru, Chiru Pawan, Pawan dinner, Pawan Dinner with Mega Family, Pawan congratulate Chiru, Pawan Meets Chiru, Pawan kalyan Chiranjeevi, Chiranjeeevi Pawan kalyan, Katamarayuru meets Khaidi, Khaidi Katamarayudu, Khaidi No 150 success, Pawan congrtaulate Chiru, Pawan meets Chiru

Pawan Kalyan finally meets Chiranjeevi and congratulate him over Khaidi No 150 success. and also dinner with mega family.

ఎట్టకేలకు చిరును కలిసిన పవన్

Posted: 01/20/2017 09:04 AM IST
Pawan kalyan finally meets chiru

మెగా అభిమానులకు పండగలాంటి వార్త. మెగా స్టార్ చిరంజీవితో త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎట్టకేలకు భేటీ అయ్యాడు. తాజాగా చిరంజీవి న‌టించిన ఖైదీ నంబ‌రు 150 సినిమా విడుదలై వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నయ్యకు కంగ్రాట్స్ చెప్పేందుకు పవన్ వెళ్లినట్లు తెలుస్తోంది.

నిజానికి ప్రీ రిలీజ్ వేడుక‌కు పవన్ హాజ‌రు కావాల్సి ఉంది. అయితే కాటమరాయుడు షూటింగ్, రాజకీయ కారణాలతో బిజీగా ఉండటంతో అది కుదరలేదు. చాలా ఏళ్ల తర్వాత చిరు రీఎంట్రీ ఇస్తుంటే పవన్ అంత బిజీ అయిపోయాడా? అంటూ విమర్శలు వినిపించాయి. ఎట్టకేలకు సమయం చిక్కటంతో ప‌వ‌న్ చిరు ఇంటికి వెళ్లి మరీ స‌మావేశం అయ్యాడు. ఆపై కుటుంబ సభ్యులతో డిన్నర్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే సినిమా సంగతి పక్కన పెడితే, రాజకీయంగా వీరు ఏవైనా చర్చింకున్నారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాగా, ఖైదీ నంబర్ 150 చిత్రం సక్సెస్ కావాలంటూ పవన్ తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేసిన విషయం తెలిసిందే. మొత్తానికి పవన్ ఎట్టకేలకు చిరును కలవడంతో విమర్శలకు చెక్ పడటమే కాదు, మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Pawan Kalyan  Khaidi No 150  

Other Articles

Today on Telugu Wishesh