వందలడిగితే వేలిచ్చి.. షాక్ కు గురిచేసిన ఏటీయం.. Man asks ATM to dispense Rs 3500, gets Rs 70k

Man asks atm to dispense rs 3500 gets rs 70k

atm, atm queues, atm transaction fees, demonetisation, narendra modi, rajasthan, atm give more money, bank of baroda atm, rajasthan atm, Tonk village atm, Jitesh Diwakar, Demonetisation, Currency ban, ATM, ATM malfunction, Rajasthan

This ATM in Rajasthan gave people more cash than what people originally asked for. The bank officials claimed it was a "glitch."

వందలడిగితే వేలిచ్చి.. షాక్ కు గురిచేసిన ఏటీయం..

Posted: 01/18/2017 06:15 PM IST
Man asks atm to dispense rs 3500 gets rs 70k

పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నగదు కొరత, నగదు కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డ ఘటనలు అనేకం వెలుగుచూశాయి. ఈ క్రమంలో అనేక మంది బ్యాంకు క్యూ లైన్లలో అసువులు బాసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు అనేకం కేంద్రంతో పాటు ఇటు రిజర్వు బ్యాంకుపై కూడా విమర్శలను సంధించాయి. అయితే ఇప్పుడిప్పుడే ప్రజలకు డిమానిటైజేషన్ ప్రభావం నుంచి కోలుకుంటున్న తరుణంలో రాజస్థాన్‌ లోని ఒక  ఏటీఎం మాత్రం వందలు అడిగితే ఏకంగా వేల రూపాయలను ఇచ్చి షాక్ కు గురిచేసింది.

ఈ విషయం దవానంలో వ్యాపించడంతో సదరు ఏటీయంలో డబ్బులు విత్ డ్రా చేసేందుకు పోటీ పడ్డారు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌ కు సమీపంలోని టాంక్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏటీఏంలో డబ్బులు డ్రా చేసుకున్న వ్యక్తుల్ని అశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఏటిఎం కేంద్రానికి వచ్చిన ప్రజలు హఠాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో కంగారు పడ్డారు. వెంటనే విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే 100 నోట్లకు బదులుగా రెండు వేల నోట్లు జారీ  కావడంతో ఈ పరిణామం సంభవించిందని ప్రాథమికంగా  భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే  జితేష్ దివాకర్  ఏటీఎంకు వెళ్లి.. 3500  కావాలని టైప్‌ చేశాడు.  కానీ రూ 3,500 స్థానంలో రూ 70వేలు రావడంతో షాకయ్యాడు. దాదాపు ఇదే అనుభవం మిగిలినవారికి కూడా ఎదురైంది. అయితే   ఏటీఎం మిషీన్‌ లో లోపాన్ని తండ్రి, ఇతర బంధువులకు  చేరవేశాడు దివాకర్‌. వారు  బ్యాంక్‌ ​ మేనేజర్‌ కు  సమాచారం అందించడంతో బ్యాంక్‌ సిబ్బంది అప్రమత్తయ్యారు.  వెంటనే  ఏటీఎంను  మూసివేశారు. కానీ అప్పటికే రూ.6.76 లక్షలు విత్‌ డ్రా అయిపోయాయి.  

రూ.100 నోట్ల స్లాట్‌ లో రూ.2 వేల నోట్లను  లోడ్‌ చేయడం వల్ల  లోపం తలెత్తిందని బ్యాంక్‌​  ప్రతినిధి హరిశంకర్‌ మీనా తెలిపారు.  కానీ సాధారణంగా ఇలా జరగదనీ, సాంకేతికంగా  రూ 100 కేసెట్ లో  రూ 2వేల నోట్లు లోడ్ చేయడం సాధ్యం కాదని  అందుకే ఈ తప్పిదంపై సాంకేతిక నిపుణులతో సంప్రదించనున్నట్టు తెలిపారు. అలాగే ఏటీఎం  మెషీన​ రికార్డుల అధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వారి సహకారంతో  నగదును ఖాతాదారులనుండి తిరిగి రాబడతామ చెప్పారు.  దివాకర్  ఒక్కరే తమకు సమాచారం అందించాడనీ.. మిగిలినవారు   అదనపు నగదు తో ఇంటికి వెళ్లి మిన్నకుండిపోయారని మీనా వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jitesh Diwakar  Demonetisation  bank of baroda  ATM  ATM malfunction  Rajasthan  

Other Articles