ప్రధాని సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌ నేర్చుకోమ్మంటే.. వీళ్లు.. PM devotees "sense of rumor" condemned by kumar vishwas

Pm devotees sense of rumor condemned by kumar vishwas

kumar vishwas, aam aadmi party, aap to bjp, kumar vishwas joining bjp, up polls, up elections, aap leaders, twitter, kumar vishwas clears rumours on twitter, manish sisodia, aap, bjp, rumour

Aam Aadmi Party leader and poet Kumar Vishwas has denied recent rumours of him leaving AAP to join BJP to contest for Sahibabad constituency in Ghaziabad district for the upcoming UP elections.

ప్రధాని సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌ నేర్చుకోమ్మంటే.. వీళ్లు.

Posted: 01/18/2017 05:20 PM IST
Pm devotees sense of rumor condemned by kumar vishwas

ప్రధాని మోదీ తమ కార్యకర్తలను, తన అభిమానులను ’సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌’ పెంచుకోమని చెప్తే.. ఆయన భక్తులు మాత్రం ’సెన్స్‌ ఆఫ్‌ రూమార్‌’ను పెంచుకుంటున్నారని అమ్ అద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ఎద్దేవా చేశారు. తాను అప్ నుంచి బీజేపి పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు రావడంతో.. ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆప్‌ అధినేత అరవింద్‌ క్రేజీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడైన కుమార్‌ విశ్వాస్‌ పార్టీని వీడి.. బీజేపీలోకి జంప్‌ చేయబోతున్నారన్న వార్త ఇవాళ ఉదయం నుంచి అటు సోషల్ మీడియాతో పాటు ఇటు జాతీయ పోర్టల్స్ లోనూ పెను సంచలనంగా మారింది.

యూపీ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్‌ మీద పోటీ చేస్తారని వదంతులు చెలరేగాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని షహిబాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపి టీకెట్ పై పోటీ చేయనున్నారన్న వార్తలు కూడా జోరందుకున్నాయి, సోషల్‌ మీడియాలో గుప్పుమన్న ఈ వదంతులు మీడియా కూడా ప్రసారం చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో వాటిపై చిరాకు కలిగిన కుమార్ విశ్వాస్ మొదట తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా.. కుమార్ విశ్వాస్ కాంగ్రెస్, టీఎంసీ, అన్నాడీఎంకే, బీజేడి, జేఎంఎం, ఏజీపీ పార్టీలలో చేరుతున్నారని వ్యంగ్యంగా ట్విట్ చేశారు.

kumar vishwas twitterప్

ఆ తరువాత ఇవాళ.. మరోమారు ట్విట్ చేసిన కుమార్ విశ్వాస్.. ‘విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని మోదీ టీడీపీలో చేరబోతున్నారని తెలిసింది. దీనిని వార్తాకథనంగా ప్రసారం చేయండి. మీలాగే జోక్‌ చేస్తున్నా గైస్‌’ అంటూ సెటైరికల్ ట్విట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా మరో అడుగు ముందుకువేసి ప్రధాని మోదీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారని, త్వరలోనే రాహుల్‌ను కలుస్తారని వ్యంగ్యంగా అన్నారు. అమిత్‌ షా ఆప్‌లో చేరబోతున్నారా? అంటూ మరో ఢిల్లీ మంత్రి కపిల్‌ మిశ్రా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kumar vishwas  aam aadmi party  up elections  aap leaders  twitter  manish sisodia  aap  bjp  rumour  

Other Articles

Today on Telugu Wishesh