ప్రకాష్ సింగ్ బాదల్ కు తప్పని పరాభవం.. Shoe thrown at Prakash Singh Badal at Bhatinda

Punjab cm parkash singh badal injured in shoe attack at rally

Parkash Singh Badal, Punjab chief minister, Punjab elections, Shoe hurled at Parkash Singh Badal, punjab elections, punjab polls, sukhbir singh badal, aap, aap rally, aam aadmi party, sangat mandi falls, rupinder kaur ruby, kejriwal, bhagwant mann, jaskirat kaur mann, sad

A shoe was hurled at Punjab chief minister Prakash Singh Badal while he was promoting his party for the upcoming Punjab assembly elections.

పంజాబ్ కురువృద్ద నేతకు ఘోర పరాభవం..

Posted: 01/11/2017 05:50 PM IST
Punjab cm parkash singh badal injured in shoe attack at rally

మరో ఇరవై రోజుల వ్యవధిలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న పంజాబ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు చేదు అనుభవం ఎదురైంది. శిరోమణి అకాలీదళ్ కురువృద్దుడైన ప్రకాశ్ సింగ్ బాదల్ కు మరోమారు పరాభవం జరిగింది. తన సొంత జిల్లా అయిన ముక్తసర్ లోని లాంబీలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయనపై ఓ వ్యక్తి షూ విసిరాడు. బూటు నేరుగా వచ్చి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ను తగిలింది. దీంతో ఆయన చేతిలోని గ్లాస్‌ పగిలిపోయింది.

అయితే ముఖ్యమంత్రి భధ్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు..? ఎందుకు బూటు వచ్చి తగిలేంత వరకు ఉరుకున్నారన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. కాగా, ఈ ఘటనలో ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారని, ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని యథాతథంగా కొనసాగించారని భద్రతా అధికారులు తెలిపారు. బూటుతో ఏకంగా ముఖ్యమంత్రిపైనే దాడి చేసిన వ్యక్తిని గురుబచన్‌ సింగ్‌గా గుర్తించి.. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌పై షూ దాడి జరగడం ఇది రెండోసారి. గతంలో 2014లో కూడా ఆయనపై ఇదే తరహాలో  బూటు దాడి జరిగింది. ఖన్నా జిల్లా ఇస్సులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై ఓ వ్యక్తి గతంలో షూ విసిరాడు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన తాజా ఘటనపై బాదల్‌ తనయుడు, డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌ సింగ్ బాదల్‌ మండిపడ్డారు. పంజాబ్‌ను మరో కశ్మీర్‌ మార్చాలని కుట్రపన్నుతున్నవారే.. సీనియర్‌ మోస్ట్‌ నాయకుడిపై ఈ హేయమైన చర్యకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles