గూగుల్ ఎర్త్ లో అణు నౌక ఫోటో.. పాక్ కి సపోర్ట్ ఎవరు? | China Submarine spotted in Pakistan.

Chinese nuclear submarine seen at karachi

China, Nuclear attack submarine, Pakistan, Karachi, Google Earth, Indian Army Alert, Pakistan Nuclear Submarine, Pakistan China Nuclear plan, China Submarine spot, Nuclear deal, Pakistan and China

A Chinese nuclear attack submarine docked in the harbour in Karachi in May last year, shows an image on Google Earth, proving that Beijing might be scrutinizing Indian warships' movements far more closely than earlier.

గూగుల్ ఎర్త్‌లో న్యూక్లియర్ సబ్ మెరిన్ కలకలం

Posted: 01/06/2017 05:35 PM IST
Chinese nuclear submarine seen at karachi

భారత్ అగ్ని క్షిపణి కంటే సమర్థవంతమైనవి, సామర్థ్యమైనవి పాక్ వద్ద ఉన్నాయంటూ చైనా వ్యాఖ్యలు చేసిన వేళ మరో ఉదంతం కలకలం రేపుతోంది. పాకిస్థాన్‌లోని క‌రాచీ ఓడ‌రేవులో చైనాకు చెందిన అణు జలాంతర్గామి ఉన్నట్లు నిరూపించే ఓ ఫోటోతో ఒక్కసారిగా రక్షణ దళం ఉలిక్కిపడింది.

ఉపగ్రహ ఛాయాచిత్రాలను గుర్తించడంలో నిపుణుడైన ఒక వ్యక్తి గూగుల్ ఎర్త్‌లోకి వెళ్లి చూడ‌గా అత‌డికి ఈ ఫోటో క‌నిపించింది. గూగుల్ ఎర్త్‌లో 2016 మే నాటికి వెళ్తే ఈ జలాంతర్గామి స్పష్టంగా కనిపిస్తుందన్న విషయాన్ని అతను అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దాని సాయంతో చైనా ఇంతకుముందు కంటే ఇప్పుడు భారతీయ యుద్ధనౌకల కదలికలను మరింత దగ్గరనుంచి గ‌మ‌నిస్తున్న‌ట్లు స్పష్టమైంది. ఈ అణు జ‌లాంత‌ర్గాముల్లో రియాక్ట‌ర్ల కార‌ణంగా ఇంధ‌న‌కొర‌త అనే స‌మస్యే త‌లెత్త‌దు. అంతేకాదు, అణు జలాంతర్గాములు ఎంత దూరమైనా వెళ్లగ‌లుగుతాయి.

టోర్పడోలు, క్రూయిజ్ మిసైళ్లు ఉన్న ఈ జలాంతర్గాములను ఎంత‌కాలం అయినా స‌రే నీటి అడుగునే ఉంచ‌వ‌చ్చు. అయితే, దీనిపై స్పందించిన ర‌క్ష‌ణశాఖ అధికారులు అటువంటి వాటిని గుర్తించడం దాదాపు అసాధ్యమేన‌ని, అక్క‌డ ఉన్నది అణుజలాంతర్గామేన‌ని కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. అవి బాగా నిశ్శబ్దంగా ఉండి, ఏ మాత్రం గుర్తించడానికి వీలు లేకుండా ఉంటాయ‌ని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు దాడులు చేసే అవకాశం లేకపోయినా అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరిక మాత్రం జారీ అయ్యింది.

నౌకాదళం చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా గత నెలలోనే మాట్లాడుతూ... చైనా యుద్ధ నౌకలు, జలాంతర్గాముల కదలికలను భార‌త్ విమానాలు, నౌకల సాయంతో గ‌మ‌నిస్తూనే ఉంద‌ని చెప్పారు. అయితే, ఇప్పుడు
ఈ అణు జలాంతర్గామి క‌రాచీలో ఉండ‌డం అల‌జ‌డి రేపుతోంది. కాగా, గత పదేళ్ల కాలంలో చైనా సహకారంతో పాక్ నౌకాయాన సంబంధాలు కొనసాగించటం తెలిసిందే. 46 బిలియన్ల డాలర్లతో గ్వాడార్ పోర్ట్ వద్ద ఆర్థిక ఒప్పందం కూడా చేసుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  China  Pakistan  Nuclear Submarine  karachi  Google Earth  

Other Articles

Today on Telugu Wishesh