అన్ని గమనిస్తున్నానని జోకు చేసిన ప్రధాని PM Modi mocks Lalu Prasad Yadav's son

Pm modi mocks lalu prasad yadav s son for krishna avatar

Tej Pratap Yadav, Tej Krishna, Krishna, Lalu, Lalu Prasad Yadav, Nitish Kumar, Bihar, Narendra Modi, Liquor ban, Prime Minister, demonetisation

PM Modi added some zing to the meal by joking around with Tej Pratap Yadav, "Aap toh Kishan Kanhaiya ho gaye hain (you are becoming a likeness of Krishna),".

ప్రధాని జోకు పేల్చితే.. పంబరేగిపోద్ది..

Posted: 01/06/2017 04:05 PM IST
Pm modi mocks lalu prasad yadav s son for krishna avatar

బిహార్‌లో గురు గోవింద్‌ సింగ్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ.. ఆ కార్యక్రమాన్ని ముగించుకున్న పిమ్మట బీహార్ ముఖ్యమంత్రి, నాటి పాత స్నేహితుడైన నితీశ్ కూమార్‌, బీహార్ అధికారపక్ష పార్టీ రాష్ట్రీయ జనతాపార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తో సహా అతని కుమారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంలో తన ప్రభుత్వంపై ఎవరెవరు ఏమేం మాట్లాడతారో.. తానకు తెలుస్తుందని, విమర్శకులను తాను ఓ కంట కనిపెడుతూనే వుంటానన్న సంకేతాలను ఇచ్చారట ప్రధాని మోడీ.

తాను అన్ని గమనిస్తుంటానని చెప్పకనే చెప్పేశారట. అదేంటి ఎక్కడో ఢిల్లీలో వుండే వారికి మా రాష్ట్రంలో జరుగుతున్న చిన్న చిన్న పరిణామాలు ఎలా తెలుస్తాయని అన్న సందేహం రానీయకుండా చిన్నపాటి జోక్ పేల్చుతూనే రాష్ట్ర మంత్రుల పంబరేపారట. అదెట్ట సాధ్యం అని అనుకుంటున్నారా.. ఇందుకు మోడీ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఆయన వినియోగించుకున్నారు. ఏకంగా బీహార్ మంత్రిగా వున్న అయనపై జోకు పేల్చి తాను అన్ని గమనిస్తుంటానని పరోక్ష సందేశమిచ్చారట.

అందరూ కలిసి భోజనం చేస్తున్న సందర్భంలో 'అయితే నువ్వు ఇప్పుడు కృష్ణుడివన్నమాట' అని మోదీ అనగానే అక్కడ నవ్వులు విరిసాయి. అదేంటి లాలు కుమారుడిని మోదీ కృష్ణుడు అనడమేమిటని అనుకున్నారా.. నూతన సంవత్సర వేడుకలను వెరైటీగా జరుపుకున్న ఆయన కృష్ణుడిలా వస్త్రాధరణ చేసుకొని, పిల్లనగ్రోవి వాయిస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఆయన ఫోటో కూడా సోషల్‌ మీడియాలో పరుగులు పెట్టింది. ఈ ఫొటో చూసిన మోదీ ఏకంగా తానే కంటపడే సరికి ఈ జోకు పేల్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles