జనసేన ‘ఉద్ధానం’ వార్నింగ్.. బాబు డిక్లేర్ చేశాడు | Chandrababu react on Uddanam.

Chandrababu announcement on uddanam

Andhra Pradesh, Chief Minister, Chandrababu Naidu, Uddanam Kidney victims, Chandrababu react on Uddanam, AP government helps Uddanam, Pawan Kalyan Chandrababu Naidu Uddanam, Uddanam Issue, AP govt announced help, Uddanam Help, Pawan success in Uddanam

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu react and announced help to Uddanam Kidney victims.

పవన్ ఎఫెక్ట్: ఉద్ధానంపై సీఎం ప్రకటన

Posted: 01/06/2017 03:52 PM IST
Chandrababu announcement on uddanam

ఎట్టకేలకు పవన్ డిమాండ్లకు ప్రభుత్వం దిగొచ్చింది. ఉద్ధానంలో కిడ్నీ బాధితులకు అండగా ఉంటామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రకటన చేశారు. కిడ్నీలు దెబ్బతిన్నవారికి వికలాంగుల పింఛన్లు మంజూరు చేస్తాన్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం ఉదయం ఆయన ఆయాశాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఉద్ధానం సమస్యను డాక్టర్ సిఎల్ వెంకట్రావు ప్రస్తావించించగా, సాయంపై చంద్రబాబు ప్రకటన చేశాడు.

తీవ్రమైన ఈ సమస్యను ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖలు సవాల్‌గా తీసుకోవాలని చంద్రబాబు సూచించాడు. అలాగే ఈ సమస్యపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నాడు. యుద్ధప్రాతిపదికన ఉద్దానం సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని, శాశ్వత పరిష్కారంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాల్సి ఉందని తెలిపాడు. ఉద్దానంలాంటి సమస్యల పరిష్కారానికి సైన్స్ కాంగ్రెస్ లాంటి సదస్సులు వేదిక కావాలని పిలుపు కూడా ఇచ్చాడు. దీంతో ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న విమర్శలతోపాటు వివాదం మరింత ముదరక ముందే చెక్ పెట్టినట్లయ్యింది.

మరోవైపు సమస్య పరిష్కారం 48 గంటల్లో తేలేది కాదని, దీనిపై దీర్ఘకాలిక చర్చలు జరగాల్సిన అవసరం ఉందని మంత్రి కామినేని శ్రీనివాస్ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 24 గంటలు గడవక ముందే స్వయంగా సీఎం సాయం గురించి ప్రకటన చేయటంతో పరిస్థితి చల్లారిందే అనుకోవచ్చు.

ఇక ఫుష్కరాలు, పండగల పేరిట కోట్లు ఖర్చుపెట్టే ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు పట్టవా? అంటూ పవన్ ముఖాముఖిలో గళం ఎత్తిన విషయం తెలిసిందే. సమస్య పరిష్కారం కాకపోతే తాను రంగంలోకి ఉద్యమిస్తానని స్వయంగా పవన్ ప్రకటించాడు కూడా. దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న ఓ ప్రజా సమస్యను వెలుగులోకి తేవటమే కాదు, ప్రతిపక్షాలు కూడా చేయలేని ఆ పనిని సమర్థవంతంగా హ్యాండిల్ చేసి పరిష్కారం అయ్యేలా జససేనాని  సక్సెస్ అయ్యాడనే అనుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan kalyan  Ap govt  Uddanam Kidney Issue  Chandrababu  announcement  

Other Articles