నో్ట్ల రద్దుతో మాటేసిన కమీషన్ కేటుగాళ్లు.. Politicians offer to convert black money into white

Politicians offer to convert black money into white for 40 commission

political groups, banks, black money, high-value bank notes, Congress, BSP, SP, Notes Ban, Demonetisation, Rs 500 and 1000 notes banned, Old 500 Rupee Notes, Arun Jaitley, PM Modi, Hospitals, Medical shops, toll gates, water bills, electricity bills

The leaders were found to be carrying out their shady operations right inside their party offices in Ghaziabad, Noida and Delhi.

నోట్ల రద్దుతో మాటేసిన కమీషన్ కేటుగాళ్లు..

Posted: 12/14/2016 01:10 PM IST
Politicians offer to convert black money into white for 40 commission

పెద్దనోట్ల రద్దు చేస్తూ కేంద్రం చారిత్రక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూసింత అవగాహన వున్నవాళ్లే.. వక్రమార్గాలు ఎలా పట్టాలా..? నల్లధనాన్ని ఎలా తెల్లధనంగా మార్చుకోవాలన్న అన్నమార్గాలను అడగకుండానే చెప్పస్తున్నారు.. వీరి మాటలను నమ్మిన కోందరు నల్లకుభేరులు కమీషన్ పద్దతిలో మార్చేస్తున్నారు. ఇంకోందరు మాత్రం అసలు లేదు కోసరు లేదని, చేతికందిన కాడికి డబ్బు తీసుకుని పరారవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలకు చెందిన నేతలు.. ఎంతవరకు తమ విధివిధాలపై స్పష్టంగా వున్నారో పరీక్షించేందుకు ఓ జాతీయ మీడియా సంస్థ నల్లకుబేరుల అవతారం ఎత్తింది. రంగుమార్చుతున్న రాజకీయ నేతల అసలు రంగును బయటపెట్టింది.

కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ఓ వైపు విమర్శిస్తూనే.. విపక్షాలకు చెందిన పలువరు నేతలు నల్లధనాన్ని కమీషన్ కింద తెల్లధనంగా మార్చేస్తామంటూ భారీగా హామీలు గుప్పిస్తున్నారు. ఇదంతా జాతీయ మీడియా తన స్టింగ్ అపరేషన్ లో బయటపెట్టని వాస్తవం. ఈ మీడియా స్టింగ్ అపరేషన్ లో బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్, ఎన్సీపీ, జేడీయూల నేతలు కమిషన్‌ కోసం బేరాలాడుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. నల్లధనాన్ని సక్రమార్జనగా చేసే నయాదందాకు.. పలు పార్టీల నేతలు వారి కార్యాలయాలనే  అడ్డాలుగా మలుచుకుంటున్నారు.

ఈ క్రమంలో ఓ జాతీయ మీడియాకు చెందిన జర్నలిస్టులు నల్లకుబేరుల అవతారం ఎత్తి ఏకంగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడ కాంగ్రెస్‌ నేత తారిఖ్‌ సిద్దిఖీని కలిసిన ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌లు రూ. కోటి నల్లధనాన్ని మార్చడానికి వీలవుతుందా అని ప్రశ్నించారు. దానికి సిద్దిఖీ.. అందుకు తనకు తెలిసిన ఎన్జీఓను పరిచయం చేస్తానని హామీ ఇచ్చాడు. తనకు తెలిసిన వేరే మార్గాలూ ఉన్నా కానీ అవి అంత నమ్మకమైనవి కావని, ఈ ఎన్జీవోను నమ్మొచ్చని అన్నాడు.

దీంతో అక్కడ ముచ్చటను ముగించిన జర్నలిస్టులు ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్‌ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు వీరేంద్ర జాటవ్‌తో.. 10 కోట్ల నల్లధనాన్ని మార్చాలంటూ బేరం ప్రారంభించగా.. 40 శాతానికి తగ్గకుండా కమీషన్‌ ఇస్తే కొత్త నోట్లు ఇస్తానని జాటవ్‌ హామీ ఇచ్చాడు. ‘హ్యాండ్‌ టు హ్యాండ్‌.. మొత్తం కొత్త నోట్లే ఇస్తా’నని స్పష్టం చేశాడు. దీంతో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు కంగుతిన్నారు. రాజకీయ నేతలను తక్కువగా అంచనా వేశామని మదిలో అనుకున్న జర్నలిస్టులు.. ఇక వేరే పార్టీ కార్యాలయాలకు చేరుకున్నారు.

ముందుగా సమాజ్‌వాదీ పార్టీ నోయిడా మహానగర్‌ శాఖ సభ్యుడు టిటు యాదవ్‌ ను కలిసిన జర్నలిస్టులు.. తమ వద్దనున్న 10 కోట్ల రూపాయల నల్లడబ్బును మార్చాలని కోరగా, ఆయన కూడా నలభై శాతం కమీషన్‌కు ఎంత మొత్తమైనా డబ్బును మార్పి చేస్తామని తేల్చిచెప్పాడు. ఇక ఎన్సీపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శి రవి కుమార్‌ను కలిసి కోటి రూపాయల బ్లాక్‌ మనీని మార్చాలంటూ అడగగా.. 30 శాతం కమీషన్‌కు మార్చేస్తానన్నాడు. అందుకుగాను తన మదిలో వున్న ఓ ఉపాయాన్ని కూడా ఆయన ఉచితంగా సెలవిచ్చాడు.

అది చాలదన్నట్లు త్వరగా నల్లడబ్బును తీసుకురావాలని కోరాడు. అనుకున్న ఒప్పందం ప్రకారం 70% అమౌంట్‌ తిరిగిచ్చే హామీ తనదని వారికి హామి కూడా ఇచ్చాడు. అది కూడా క్‌ రూపంలో ఇస్తానని పేర్కొన్నాడు. అదెలా అని ప్రశ్నించిన జర్నలిస్టులకు ఆయన తన మదిలోని ఉపాయాన్ని కూడా సెలవిచ్చాడు. ‘ఒక నకిలీ పీఆర్‌ కంపెనీని సృష్టిస్తాం.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆ కంపెనీ సేవలు ఉపయోగించుకున్నామని చెబుతాం’ అన్నారు. జేడీయూ ఢిల్లీ ఉపాధ్యక్షుడు సతీశ్‌ సైనీని పార్టీ ఆఫీస్‌లో సంప్రదించగా.. 40% కమీషన్‌ నడుస్తోంది కానీ.. నేను 30 శాతానికి పని చేసి పెడ్తాను’ అని తెలిపినట్లు జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.

కాగా, ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టేందుకు కావాలని బీజేపి ప్రేరణతోనే మీడియా స్టింగ్ అపేరేషన్ చేయించిందన్న అరోపణలు కూడా గుప్పముంటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై  ఆ పార్టీకి చేందిన నేతలు ఎలా స్పందిస్తున్నారు.. నల్లధనాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారన్న కథనాలు వెల్లడికావాల్సిన తరుణంలో విపక్షాలను టార్గెట్ చేయడం.. ఖచ్చితంగా అధికార పార్టీ ప్రోత్సాహంతో జరిగిన పనేనన్న అరోపణలు కూడా విపక్షాల నుంచి వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetisation  political groups  banks  black money  high-value bank notes  Congress  BSP  SP  

Other Articles