అమ్మ అంతిమ సంస్కారాలు పూర్తి.. శోఖసంధ్రమైన మెరినా.. Mass grief as Indian Tamil leader Jayalalithaa buried

Mass grief as indian tamil leader jayalalithaa buried

Jayalalithaa last journey, Jayalalithaa last rituals, Jayalalithaa marina beach, Jayalalithaa last rites, PM Modi, jayalalithaa, last journey, marina beach, sasikala natarajan, chennai, rajaji hall, president, pranab mukherjee, PM Modi, Narendra modi, Narendra modi pays tribute to jayalalithaa, jayalalithaa, pawan kalyan chennai, rajaji hall, pawan Kalyan, jayalalithaa demise

AIADMK leader earned a pan-India respectability that eluded her during the nearly three decades she spent in politics.

అమ్మ అంతిమ సంస్కారాలు పూర్తి.. శోఖసంధ్రమైన మెరినా..

Posted: 12/06/2016 07:28 PM IST
Mass grief as indian tamil leader jayalalithaa buried

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంతిమ సంస్కారాలు అధికార లాంఛనాలతో ముగిశాయి. చెన్నైలోని రాజాజీ హాలు నుంచి మూడు కిలోమీటర్ల నిడివి వరకు అమె అంతిమ యాత్ర కొనసాగింది. అభిమానులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషుల అశ్రునయనాల మధ్య మెరినా బీచ్ వరకు సాగింది. మెరినా బీచ్ లో స్వర్గీయ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ సమాధికి 20 అడుగుల పక్కన జయలలిత పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అమ్మ కడసారి చూపుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాధి మంది అభిమానులు అంతిమ సంస్కారాలకు హజరయ్యారు.

మెరినా బీచ్ లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాధా కృష్ణన్, గవర్నర్ విద్యాసాగర్ రావులు అమ్మకు కడసారి వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ, పార్టీ సీనియర్ నేత గులాంనబి అజాద్ తో పాటు జాతీయ నాయకులు, రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య తదితరలు హాజరై అమ్మకు కడసారి నివాళులు అర్పించారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పలు పార్టీలకు చెందిన ప్రతినిధులు కూడా అమ్మను అంజలి ఘటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సహా పలువురు మంత్రులు కూడా అమ్మ అంతిమంగా నివాళులు సమర్పించారు.

జయలలిత భౌతికకాయానికి సన్నిహితురాలు శశికళ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమ సంస్కారాలు జరిగినంత సేపు శశికళతో పాటు జయలలిత మేనల్లుడు కూడా శశికళతో పాటే వున్నారు. చందనపు పేటికలో జయ పార్థీవ దేహాన్ని ఉంచి ఖననం చేశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ ఎమ్జీఆర్‌ సమాధికి 20 మీటర్ల దూరంలో జయలలిత పార్థీవ దేశాన్ని భౌతికకాయాన్ని ఖననం చేశారు.

ఓ రాజకీయ నేతకు అశేష జనవాహిని ఇంతగా వీడ్కోలు పలకడం ఈ మధ్య కాలంలో కనీవినీ ఎరగనంతగా..  మెరీనా తీరం కన్నీటి సంద్రమైపోయింది. అమ్మని కడసారి చూసేందుకు వెల్లువలా అభిమానులు తరలివచ్చారు. చెన్నై మొత్తం జనసంద్రమైపోయింది. మెరీనా బీచ్‌ రోడ్డు జనసంద్రంగా మారిపోయింది.

అమ్మ కోరుకున్న విధంగానే..

తన మరణానంతరం ఎలా తన అంత్యక్రియలు నిర్వహించాలన్నది.. ఎక్కడ తన అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న దానిపై కూడా అరోగ్యంగా వున్ననాటి నుంచే అమె పూర్తి క్లారిటీతో వున్నారని సమాచారం. అమె గత కొన్ని నెలలుగా పూర్తిగా లోలోన చిక్కి శల్యమైతున్న నేపథ్యంలో తన మరణానంతరం తన అంత్యక్రియలు ఎలా నిర్వహించాలన్నది మాత్రం పార్టీ ముఖ్యనేతలకు, ప్రాణ స్నేహితురాలు శశికళకు ముందుగానే చెప్పినట్లు తెలుస్తుంది.

కన్నడ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జయ లలితకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని తొలుత కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే తాను చనిపోతే తన భౌతిక కాయాన్ని దహనం చేయవద్దని, ఖననం చేయాలని, అదీ కూడా ఎంజీఆర్ సమాధి పక్కనే జరగాలని ఆమె ఆకాక్షించారు. దీంతో మంగళవారం ఆ మేరకు జయ లలిత పార్థీవ శరీరాన్ని మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్ సమాధి పక్కన ఖననం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  jayalalithaa  last journey  marina beach  sasikala natarajan  chennai  rajaji hall  Tamil Nadu  

Other Articles