ఒకేరోజు ఇద్దరు ప్రధానుల రాజీనామా.. ఎందుకు? | Two Countries Prime Ministers resigned on Same day.

New zealand and italy prime ministers resignation

Italian PM Matteo Renzi, Italy referendum, Matteo Renzi, Matteo Renzi resign, Matteo Renzi quit, New Zealand Prime Minister John Key, New Zealand Prime Minister, John Key resign, John Key quit, Italy new Prime Minister, New Zealand New Prime Minister, New PMs for Italy and New Zealand, New Zealand and Italy, Italy and New Zealand, Jon Key quit politics

New Zealand Prime Minister John Key in surprise resignation and Italian PM Matteo Renzi resigns after referendum defeat.

ఇద్దరు ప్రధానులు ఒకే రోజు రాజీనామా చేసేశారు

Posted: 12/05/2016 09:21 AM IST
New zealand and italy prime ministers resignation

సోమవారం ప్రపంచ రాజకీయాల్లో ఆసక్తిని కలిగించే రెండు ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణలో ఓడిపోయిన ఇటలీ ప్రధాన మంత్రి మట్టెయో రెంజీ రాజీనామా చేయగా, న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌ కీ మాత్రం రాజకీయ ప్రస్థానానికి అనూహ్యాంగా గుడ్ బై చెబుతూ రాజీనామా ప్రకటించాడు.

దేశ రాజ్యాంగాన్ని సవరించాలా వద్దా అనే అంశంపై ఇటలీ ఈ నెల 4వ తేదీన రెఫరెండం నిర్వహించగా, తన ప్రతిపాదనలను ప్రజలు తిరస్కరించటంతో ప్రధాని మాటెవో రెంజీ రాజీనామా చేసేశాడు. ఫలితం వెలువడిన కొన్ని గంటలకే రెంజీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ, అధ్యక్షుడు సెర్గియో మాటరెల్లాను కలసి రాజీనామా లేఖ అందజేశారు. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మాటెవో రెంజీ దేశ రాజకీయ వ్యవస్థను క్రమబద్ధీకరించాలని భావించాడు. ఈ నేపథ్యంలో ప్రధానమైన ఆర్ధిక సంస్కరణల ప్యాకేజీని అమలు చేయాలని ప్రయత్నించాడు. సెనేటర్ల సంఖ్యను తగ్గించాలని, సెనేట్‌ అధికారాన్ని పరిమితం చేయాలన్న ప్రతిపాదనలతో రెఫరెండంకు వెళ్లాడు.

2008 ఆర్ధిక సంక్షోభం తర్వాత యూరోజోన్‌లోని మరే దేశానికి లేని రీతిలో ఇటలీ ఆర్ధిక వ్యవస్థ తీరు అత్యంత అధ్వాన్నంగా వుంది. దీంతో రాజ్యాంగ సవరణలకు నో చెప్పేవారే ఎక్కువయ్యారు. దీంతో ప్రధాని ప్రతిపాదనలే తిరస్కరణ గురికాగా, అన్నమాట ప్రకారం రెంజీ రాజీనామా చేసేశాడు. అధ్యక్షుడు సెర్గియో మరో ప్రధానిని నియమించే అవకాశం ఉంది. రాజీనామా ఇచ్చాక తన పరిపాలన అనుభవం ఇంతటితో ముగిసిందని రెంజీ వ్యాఖ్యానించటం విశేషం.

షాకిచ్చిన కీ...
ఇక న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌ కీ స్వచ్ఛందంగానే రాజీనామా చేశాడు. గత 8 ఏళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. ప్రజాదరణ గల నాయకుడిగా గుర్తింపు పొందారు. వచ్చే ఏడాది ఆ దేశంలో జరిగే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. ఇతర ప్రపంచ నాయకులు చేసిన తప్పును తాను చేయబోనని జాన్‌ కీ పేర్కొన్నారు.

ప్రజాదరణ నేతగా ఉన్నప్పుడే తప్పుకోవాలని భావించినట్టు తెలిపారు. ప్రధాని పదవి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశానని, ఇక కుటుంబంతో గడుపుతానని చెప్పారు. ఈ నెల 12న పార్టీ సమావేశమై కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని జాన్‌ కీ వెల్లడించారు. ఆయన అదే రోజు అధికారికంగా పదవి నుంచి వైదొలుగుతారు. 2002లో చట్టసభకు ఎన్నికైన జాన్‌ కీ 2008లో ప్రధాని అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Italy  PM Matteo Renzi  Referendum  resign  New Zealand  Prime Minister John Key  Quit  

Other Articles