అమ్మకు గుండెపోటు.. భద్రత నేపథ్యంలో అనుమానాలు | Jayalalithaa suffers cardiac arrest, Tamil Nadu on alert.

Tamil nadu cm jayalalithaa suffers cardiac arrest

Tamil Nadu CM Jayalalitha, CM Jayalalitha, Chief Minister Jayalalitha, Jayalalitha Cardiac Arrest, Cardiac Arrest Jayalalitha, Jayalalitha Health, jayalalitha Apollo Hospital, Tamil nadu Alert, Jayalalithaa News, Jayalalithaa Tamil Nadu, AIDMK Jayalalithaa, Tamil Nadu Alert

Jayalalithaa Had Cardiac Arrest Sunday Evening, Says Hospital And Party.

ఆపదలో అమ్మ.. తమిళనాట ఎమర్జెన్సీ...

Posted: 12/05/2016 07:49 AM IST
Tamil nadu cm jayalalithaa suffers cardiac arrest

తమిళనాడులో ఒక్కసారిగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను సాధారణ వార్డు నుంచి అత్యవసర చికిత్సా విభాగం (ఐసీయూ)కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వెంటనే జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఓ ప్రకటన విడుదల చేసిన అపోలో ఆస్పత్రి ఇంతవరకు మళ్లీ స్పందించకపోవటంతో టెన్షన్ నెలకొంది. అయితే అర్థరాత్రి దాటాక తమ ప్రయత్నం తాము చేస్తున్నామని, దేవుడిని ప్రార్థించండి అంటూ అపోలో వర్గాలు ట్వీట్లు చేశాయి. హృద్రోగ, శ్వాసకోశ నిపుణులు జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. మెరుగైన చికిత్స అందించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు తరలిరానున్నట్లు సమాచారం.

అయితే ఆమెకు వచ్చింది గుండెపోటు కాదని, ఆమె గుండె ఆగిందని అపోలో వైద్యులు విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేస్తోంది. ఆమెకు గుండెపోటు వచ్చినట్లయితే, 'హార్ట్ ఎటాక్' అన్న పదం న్యూస్ బులెటిన్ లో ఉండేదని, వైద్యులు 'కార్డియాక్ అరెస్ట్' అన్న పదం వాటడంతో, శరీరంలోని వివిధ భాగాలకు రక్తసరఫరాను గుండె ఆపేసినట్టు అర్థం చేసుకోవాలని వైద్యులు అంటున్నారు. నిజానికి కార్డియాక్ అరెస్టుకు, గుండెపోటుకు చాలా తేడా ఉందని, కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తే, రోగి ఉన్నట్టుండి కుప్పకూలతాడని, ఊపిరి తీసుకోకపోవడం నిలుస్తుందని, స్పందనలు ఉండవని, అదే గుండెపోటు వస్తే, గుండె కొట్టుకునే తీరు అసాధారణంగా మారుతుందని, రక్తసరఫరాకు ఆటంకం కలిగి, తద్వారా గుండెనొప్పి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ రెండు సందర్భాలూ ప్రమాదకరమైనేవని, అయితే, కార్డియాక్ అరెస్ట్ తో పోలిస్తే హార్ట్ ఎటాక్ లో కోలుకునే సందర్భాలు అధికమని చెబుతున్నారు.

మరోవైపు రాష్ట్రపతి, ప్రధాని కూడా చెన్నై వెళ్తున్నారన్న వదంతులు, భద్రతా దళాల మోహరింపు నేపథ్యంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

 

గత సెప్టెంబర్‌ 22న డీహైడ్రేషన్‌, తీవ్ర జ్వరం, మొదలైన రుగ్మతల కారణంగా స్థానిక గ్రీమ్స్ రోడ్డులో ఉన్న అపోలో ఆసుపత్రిలో జయలలిత చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. లండన్‌కు చెందిన అవయవ ఇన్ఫెక్షన్‌ చికిత్సా నిపుణుడు డాక్టర్‌ రిచర్డ్ బేలీతోనూ సంప్రదింపులు జరుపుతోంది., ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, సింగపూర్‌ ఫిజియో థెరపీ వైద్యులు ఇచ్చిన చికిత్స కారణంగా ఆమె కోలుకోవడంతో గత 19న ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు మార్చారు. కాగా, గత రెండు నెలలుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె త్వరలో ఇంటికి చేరుకుంటారని భావిస్తున్న సమయంలో మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో అన్నాడీఎంకే నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు.

 

అపోలో వద్ద హైడ్రామా...
జయకు చికిత్స జరుగుతున్న అపోలో అసుపత్రి పరిసరాలలో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. అమ్మ అనారోగ్య పరిస్థితి తెలిసి మంత్రులు ఆసుపత్రికి క్యూ కట్టారు. గవర్నర్ విద్యాసాగర్ కూడా హుటాహుటిన చెన్నైకి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాడు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఫోన్ లో గవర్నర్, డీజీపీలను ఆరాతీస్తున్నాడు. జయకు గుండెపోటు వార్త గురించి తెలియగానే అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు, జయ అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఆసుపత్రిలోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఒకానోక దశలో లాఠీ చార్జీ జరిగి పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.

రంగంలోకి ఆర్మీ బలగాలు...
మండల స్థాయి నుంచే ఆర్మ్‌డ్, రిజర్వ్ పోలీసులు బలగాలను మోహరించారు. సెలవుల్లో ఉన్న పోలీసులను కూడా వెంటనే విధుల్లో హాజరు కావాలని డీజీపీ ఆదేశించాడు. ఆసుపత్రి చుట్టుపక్కల హోటళ్ల వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఇంకోవైపు జయ ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. అమ్మకు ఏమరుు్యందోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. చెన్నై , కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలనుంచి పెద్ద సంఖ్యలో అన్నాడిఎంకే శ్రేణులు అపోలో ఆసుపత్రి వైపు తరలి వస్తుండటంతో ఆ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి.

రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు చెన్నైకి దారితీసే అన్నిమార్గాలలోనూ భారీగా చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి అన్నాడిఎంకే శ్రేణులను అడ్డుకుంటున్నారు. అన్నాడిఎంకే కార్యకర్తలంతా చెన్నై రోడ్ల మీదకు చేరడంతో రాత్రి పట్టపగలుగా మారింది. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఒకానోక దశలో లాఠీచార్జీ జరిగింది. జయలలిత పూర్తిగా కోలుకున్నారని ఎయిమ్స్ నిపుణుల బృందం ధ్రువీకరించినట్లు అన్నాడీఎంకే ప్రకటించిన కొద్ది గంటలకే జయ గుండెపోటుకు గురవ్వటం గమనార్హం.

ప్రణబ్ ట్వీట్...

కాగా, జయలలిత గుండెపోటు వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆమె వెంటనే కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అమ్మ త్వరగా మన మధ్యకు రావాలంటూ ట్వీట్ చేయగా, త్వరగా కోలుకోవాలని, మెరుగైన చికిత్స అందించాలని అపోలో వైద్యులను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  Cardiac Arrest  Tamil Nadu  Alert  

Other Articles