మంచి నిద్రలో వుండగా ఎవరైనా చిన్న శబ్దం చేస్తేనే కంగారుపడి లేస్తాం. అయితే గాఢనిద్రంలో వుండగా ఒంటిపై ఏదైనా పాకినట్టు వుంటే ఏం చేస్తాం.. వెంటనే భయపడి లెగుస్తాం. అయితే ఇలా నిద్రలో వున్నవారిని హడలెత్తించేలా లేపకూడదని, అది ప్రమాదకరమని ఇప్పటికే పెద్దలు అనేక పర్యాయాల్లో చెప్పారు. దీనికి వైద్యపరంగా కూడా కారణాలు చెప్పారు. ముఖ్యంగా హృద్రోగాలకు ఇలాంటి చర్యలు కారణమని, ఇక ఆ పరమైన వ్యాధులతో బాధపడుతున్న వారు షాక్ గురై గుండే అగే ప్రమాదం కూడా వుంటుందని వివరించారు.
ఈ విషయాలు తెలిసో, తెలియకో ఓ ప్రబుద్దుడు బిత్తర చర్యకు పాల్పడ్డాడు. తన గర్లఫ్రెండ్ పై ఓ ప్రయోగాన్ని చిత్రీకరించాలని భావించాడు. అమె గాఢనిద్రలో వుండగా తన మిత్రులతో కలసి ఈ చర్యకు దిగాడు. అదేం చర్య అనుకుంటున్నారా..? అమె గాఢనిద్రలో వుండగా, అమె మీద రెండు పేద్ద కొండ చిలువలు తెచ్చి పడేశాడు. పైథాన్లు మీద పడి పాకుతుండగా, ఉల్లికిపడి లేచిన అమె వాటిని చూసి బిగ్గరగా కేకలు వేసింది. వాటిని తన బెడ్ పైనుంచి తీసేయాలని గగ్గోలు పెట్టింది.
కొంత సేపటి వరకు అలాగే వాటిని బెడ్ పైనుంచి బాయ్ ప్రెండ్, అతని స్నేహితులు అమె వాటిని చూసి ఎలా స్పందించిందన్న దృశ్యాన్ని వీడియో తీసి ఫేస్బుక్, యూట్యూబ్‌లలో పెట్టాడు. అయితే ఇప్పడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వ్యూల కోసమో లేక లైకుల కోసమో తెలియదు కానీ.. జరగరానిది ఏమైనా జరిగి వుంటే.. ఎలా అన్న కామెంట్లు కూడా వస్తున్నాయి. పరుల ప్రాణాల మీదకు వచ్చే చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి. ఈ వీడియోతో డెరెక్ డెస్కో అనే ప్రబుద్ధుడు తనది ప్రాక్టికల్ జోక్ అని సమర్థించుకున్నా.. అతనో చెత్త బాయ్ ఫ్రెండ్ అన్న బిరుదును మాత్రం సొంతం చేసుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more