మీ ప్రార్థనలు ఫలించాయి.. ఇది నాకు పునర్జన్మే | Rebirth, Says Jayalalithaa In First Statement From Hospital

Jayalalithaa s first statement from hospital

Jayalalithaa, Jayalalithaa health, Jayalalithaa Apollo, Jayalalithaa First Statement, Jayalalithaa re birth, Tamil Nadu CM Jayalalithaa, Chief Minister jayalalithaa, Jayalalithaa Voters, Jayalalithaa By Elections

Reborn with people's prayers, will resume work soon.Jayalalithaa In First Statement From Hospital.

అపోలో నుంచి అమ్మ మాట్లాడింది

Posted: 11/14/2016 07:44 AM IST
Jayalalithaa s first statement from hospital

తీవ్ర అస్వస్థతో 50 రోజలుగా ఆస్పత్రిలోనే చికిత్సపొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత తొలిసారి మాట్లాడారు. ఆమె మాటలను ప్రస్తావిస్తూ అన్నాడీఎంకే తొలిసారి ఓ లేఖను విడుదల చేసింది. తమిళనాడుతోపాటు పలు దేశాల్లో ఉన్న అభిమానుల నిరంతర పూజలతోనే నాకు పునర్జన్మ లభించింది అంటూ అందులో తొలిపలుకులు ఉన్నాయి.

తనకోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు రెండు పేజీల లేఖలో పేర్కొన్నారు. తంజావురూ, అరవకురిచి మరియు తిరుపరాంకుంద్రం నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ప్రజలకు, అదే సమయంలో శ్రమించాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

తాను ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసి కొందరు కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడడంపై సంతాపం వ్యక్తం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జయలలిత లేఖతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. ‘అమ్మ’ కోసం తాము చేసిన ప్రార్థనలు ఫలించాలని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, సెప్టెంబర్ 22న ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్, షుగర్ లెవల్ పడిపోవటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆమెను చేర్పించిన విషయం తెలిసిందే. ఎయిమ్స్ తోపాటు, లండన్ వైద్యులు ఆమెకు చికిత్స అందించగా, 50 రోజులకు కోలుకున్నారు. ఆమె ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డిశ్చార్జి చేస్తామని అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాపరెడ్డి శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  CM Jayalalithaa  Apollo Hospital  

Other Articles

Today on Telugu Wishesh