అధ్యక్ష ఎన్నికలలో బోణి కొట్టిన హిల్లరీ.. Hillary Clinton wins Dixville Notch midnight vote

Trump takes 32 25 lead in new hampshire after midnight voting

Hillary Clinton, Hillary first win, US Presidential Elections, Dixville Notch, New Hampshire, democratic, republican, donald trump, America

Hillary Clinton won the first ballots in the US elections from dixville of new Hampshire, which is traditionally the first in the nation to vote on Election Day. Clinton won by four votes to two against her rival Donald Trump.

అధ్యక్ష ఎన్నికలలో తొలి ఫలితం ఔట్.. బోణి కొట్టిన హిల్లరీ..

Posted: 11/08/2016 01:22 PM IST
Trump takes 32 25 lead in new hampshire after midnight voting

యావత్ ప్రపంచం ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తొలి ఫలితం అప్పడే వెల్డైంది. గత ఎన్నో ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఆనవాయితీగా తొలి ఓటును వేస్తున్న న్యూ హ్యాంప్ షైర్ లోని డిగ్జ్ విల్లే నాచ్ వాసులు వినియోగించుకోగా, అప్పడే అక్కడికక్కడే ఫలితం కూడా వెల్లడైంది. అమెరికాకు తొలి మహాళా అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన డెమోక్రాటికన్ హిల్లరీ క్లింటన్ ఇక్కడి నుంచి తొలి విజయాన్ని అందుకుంది. హిల్లరీ 4-2 ఓట్ల తేడాతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఓడించారు.

కెనడా సరిహద్దుల్లో వున్న ఈ గ్రామం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ముందుగా ఓటు వేస్తుంది. వంద ఓటర్లకు తక్కువగా వున్న గ్రామాలకు ఈ సదుపాయాన్ని అక్కడి అధికారులు ఎప్పటి నుంచో కల్పించారు. దీంతో ఈ సారి కూడా 8వ తేదీ ప్రవేశించగానే అర్ధరాత్రి 12:01కి పోలింగ్ ప్రారంభం కాగా, ఊళ్లోని ఓటర్లంతా వెంటనే ఓట్లు వేయడం, అందరూ ఓటేయగానే వాటిని లెక్కించడం పూర్తయింది.

డిక్స్ విల్లే నాచ్ గ్రామంలో వాస్తవానికి మొత్తంగా 8 మంది రిజిస్టర్డ్ ఓటర్లు మాత్రమే ఉన్నారు. అందులో నలుగురు హిల్లరీకి ఓటు వేశారు. ఇద్దరు ట్రంప్ కు, మరో ఇద్దరు ఓటర్లు మిట్ రొమ్నీ, గ్యారీ జాన్సన్ లకు చెరో ఓటు వేశారు. దీంతో తన సమీప ప్రత్యర్థి ట్రంప్ కన్నా రెండు ఓట్ల మెజారిటీతో హిల్లరీ విజయం సాధించినట్లయింది. ఇదిలా వుండగా, అమెరికాలోని అధిక రాష్ట్రాలలో భారత కాలమాన ప్రకారం ఇవాళ సాయంత్రం ఐదు గంటల తరువాత ఎన్నికలు ప్రారంభం అవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles